ETV Bharat / business

వాహనం నడిచిన దూరం బట్టి బీమా ప్రీమియం! - వాహన బీమా రకాలు

వాహనా వినియోగం ఇటీవల భారీగా తగ్గింది. ముఖ్యంగా కరోనా భయాలు, వర్క్​ ఫ్రం హోం వంటివి పెరగటం వల్ల చాలా మంది వాహనాలను వినియోగించడం తగ్గించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వాహనాలకు బీమా ప్రీమియం పూర్తిగా చెల్లించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాహనం నడిచిన దూరానికే ప్రీమియం చెల్లించే విధంగా కొన్ని పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. మరి ఆ పాలసీలకు ప్రీమియం ఎలా నిర్ణయిస్తారు? వాహనాలు ఎంత దూరం నడిచాయి అనే విషయాన్ని ఎలా లెక్కిస్తారు?

pay use vehicle Insurance
పే ఆజ్ యూ డ్రైవ్ పాలసీ
author img

By

Published : Aug 6, 2020, 1:15 PM IST

వినియోగ ఆధారిత బీమా(పే ఆజ్ యూ డ్రైవ్ పాలసీ) అనేది సమగ్ర, ఓన్​ డ్యామేజీ థర్డ్ పార్టీ వాహన బీమా పాలసీ. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) రెగ్యులేటరీ సాండ్ బాక్స్ లో భాగంగా దీనిని సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.

ఐఆర్‌డీఏఐ సమక్షంలో నూతన ఆవిష్కరణకర్తలు, కంపెనీలు ప్రత్యక్ష ప్రయోగాలు చేసుకునేందుకు ఉద్దేశించినదే ఈ రెగ్యులేటరీ స్యాండ్ బాక్స్‌.

ఉదాహరణకు కంపెనీలు 10 వేల వినియోగ ఆధారిత పాలసీలను అందించేందుకు అనుమతి లభిస్తే.. ఆ మేరకు పాలసీలను విక్రయించవచ్చు. దీనితో ఆ పాలసీలకు సంబంధించి పలు అంశాలను పరిశీలించి, రెగ్యులర్ పాలసీగా దానిని అందించవచ్చా లేదా అనే విషయంపై ఒక నిర్ణయానికి వస్తాయి.

ప్రయాణ దూరం ఆధారంగా పాలసీ ప్రీమియం

వినియోగ ఆధారిత పాలసీలో వినియోగదారుడు పాలసీ తీసుకున్న కాలానికి ప్రయాణించే దూరాన్ని అంచనా వేసుకుని దాని ప్రకారం శ్లాబ్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ పాలసీలో వాహనం మోడల్, తీసుకుని ఎంతకాలం అయ్యింది తదితర అంశాల ఆధారంగా ఒక సంవత్సరానికి బీమా ప్రీమియం ఒకే సారి చెల్లించాల్సి ఉంటుంది.

డిస్కౌంట్..

ఈ వినియోగ ఆధారిత పాలసీలో ఓన్ డ్యామేజీ బీమా పైన కంపెనీలు 5 నుంచి 25 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. తక్కువ దూరం ప్రయాణించిన వారికి ఎక్కువ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. వినియోగ ఆధారిత బీమా పాలసీలో కిలోమీటర్ల ప్రకారం విభజించిన శ్లాబ్​ను వినియోగదారుడు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ శ్లాబులు కంపెనీ ఆధారంగా 2వేల కిలోమీటర్ల నుంచి 20వేల కిలోమీటర్ల స్థాయిలో ఉంటాయి.

దీనితో పాటు యాడ్​ఆన్​లు ఏమైనా ఉంటే వాటన్నింటికి కలుపుకుని ఓన్ డ్యామేజీ బీమా ప్రీమియంను నిర్ణయిస్తారు. అయితే థర్డ్ పార్టీ ఛార్జీలు అదనంగా ఉంటాయి.

ప్లోటర్ పాలసీ సదుపాయం..

కారును ఉపయోగించిన రోజుల్లో మాత్రమే ప్రీమియం చెల్లించేందుకు కొన్ని పాలసీలు అవకాశం ఇస్తున్నాయి. యాప్ ద్వారా ఈ బీమాను ఆన్, ఆఫ్ చేసుకునేందుకు వీలుంది.

ఈ పాలసీకి డ్రైవర్ వయస్సు, అనుభవం తదితర అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది. వివిధ వాహనాలను వర్తించేందుకు వీలుగా ఒకటే ఓన్ డ్యామేజీ పాలసీ అందించేందుకు ఫ్లోటర్ పాలసీల సదుపాయం కూడా ఉంది.

ఎక్కువ దూరం వెళ్తే పనిచేయదు..

ప్రయాణ దూరాన్ని ట్రాక్‌ చేసేందుకు కంపెనీలు.. ప్రత్యేక పరికరాన్ని పొందుపరచటం, ఓడోమీటర్ రీడింగ్‌ను పరిగణించటం, ప్రత్యేకమైన యాప్​పైను వినియోగించడం వంటివి చేస్తున్నాయి. ఒకవేళ తీసుకున్న శ్లాబ్ దూరం కంటే వాహన ఎక్కువ ప్రయాణిస్తే.. ఓన్​ డ్యామేజీ కవర్‌ పనిచేయదు. అయితే పాలసీ గడువు ముగిసే వరకు థర్డ్‌ పార్టీ కవరేజీ ఉంటుంది.

ప్రయాణ దూరాన్ని టాప్ అప్​ల ద్వారా పెంచుకోవచ్చు లేదా పై శ్లాబ్ తో ప్రస్తుతం ఉన్న శ్లాబ్​ ప్రీమియం వ్యత్యాసం మొత్తాన్ని చెల్లించటం ద్వారా ఎక్కువ దూరం శ్లాబ్​లోకి వెళ్లి కవరేజీ పొందవచ్చు.

బీమా ఇచ్చే కంపెనీలు..

ప్రస్తుతం ఐసీఐసీఐ లాంబార్డ్, ఎడిల్వాయిస్ జనరల్ ఇన్సూరెన్స్‌, భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ రకమైన పాలసీలను అందించిస్తున్నాయి. వీటిని పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్​ల ద్వారా మాత్రమే విక్రయిస్తున్నాయి.

సవాళ్లు..

ప్రయాణించే దూరం లెక్కించటం ప్రాక్టికల్​గా సవాళ్లతో కూడుకున్నది. ఒడోమీటర్‌, యాప్స్‌ను ట్యాంపరింగ్ చేయటానికి సాంకేతికంగా అవకాశాలున్నాయి. డ్రైవింగ్ చేసే వారి పరిస్థితి తదితర అంశాల ఆధారంగా దీర్ఘ కాలంలో ప్రీమియం నిర్ణయించటం కూడా సవాలే.

ఇదీ చూడండి:చైనాకు భారత్​ మరో షాక్​- బిడ్డర్లపై ఆంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.