ETV Bharat / business

పనిచేస్తున్న సంస్థకు పాన్​కార్డ్​ వివరాలు ఇచ్చారా? - ఐటీఆర్‌

ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థలకు తప్పకుండా పాన్​కార్డు అందజేయాలి. ఒక వేళ పాన్ అందజేయకపోతే 20% లేదా అంతకంటే ఎక్కువ రేటుతో టీడీఎస్ వ‌ర్తింప‌జేయాల‌ని ఆదాయపు పన్నుశాఖ.. సంస్థ‌లను ఆదేశించింది.

What happens if you do not provide PAN card details to your company
మీ కంపెనీకి మీ పాన్​కార్డు వివరాలు ఇవ్వకపోతే ఏమి జరుగుతుంది?
author img

By

Published : Feb 9, 2020, 11:02 AM IST

Updated : Feb 29, 2020, 5:39 PM IST

ఆదాయ‌ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం ఉద్యోగులు అంద‌రూ త‌మ పాన్​కార్డును ప‌నిచేసే సంస్థ‌లో ఇస్తేనే టీడీఎస్ మిన‌హాయించేందుకు వీలుంటుంది. టీడీఎస్ దాఖ‌లు చేసేట‌ప్పుడు పాన్ లేదా ఆధార్‌ వివరాలు అందించ‌డం సంస్థ బాధ్య‌త‌. మీరు ఆదాయపు పన్ను శాఖ 'టీఆర్​ఏసీఈఎస్​' పోర్టల్ ద్వారా టీడీఎస్‌ స్టేటస్​ తనిఖీ చేయవచ్చు.

పాన్​కార్డు 5 నిబంధనలు

  • మీ ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువగా ఉంటే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206 ఏఏ కింద మీ యజమాని తీసివేసేందుకు టీడీఎస్ లేనందున మీరు పాన్ లేదా ఆధార్ కార్డును సమర్పించాల్సిన అవసరం లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి, రూ. 2.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంది.
  • మీరు మీ పాన్ కార్డు వివరాలను అందించడంలో విఫలమైతే, మీ యజమాని టీడీఎస్‌ను 20% లేదా అంతకంటే ఎక్కువ రేటుతో తీసివేస్తారు. ఏదేమైనా, సెక్షన్ 192 ప్రకారం టీడీఎస్ కోసం లెక్కించిన ఉద్యోగి ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువగా ఉంటే టీడీఎస్ వ‌ర్తించ‌దు.
  • గ‌తేడాది నుంచి పాన్ బ‌దులుగా ఆధార్ స‌మ‌ర్పించే అవ‌కాశం ఉంది. కానీ అలా చేసే ముందు, పాన్‌- ఆధార్ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి.
  • పాన్‌కు బదులుగా మీ ఆధార్ నంబర్‌ను ఇచ్చిన‌ప్పుడు, తప్పు సంఖ్య ఇవ్వడం వల్ల ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 272 బి కింద రూ.10,000 జరిమానా ప‌డుతుంది.
  • యజమానికి పాన్ అందించడంలో మీరు విఫలమైతే, ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటీఆర్‌) దాఖలు చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా రీఫండ్‌ పొందవచ్చు.

ఇదీ చూడండి: ఐఫోన్లు స్లోడౌన్​.. యాపిల్​కు రూ.195 కోట్లు జరిమానా

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/andhra-pradesh-govt-places-senior-ips-officer-under-suspension20200209084051/

Conclusion:
Last Updated : Feb 29, 2020, 5:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.