వినియోగదారులకు కనీసం తెలియజేయకుండా ఐఫోన్ల పనితీరు మందగించేలా (ఫోన్లు స్లోడౌన్) చేసిన యాపిల్‌కు 27 మిలియన్ డాలర్లు (సుమారు రూ.195కోట్ల) జరిమానా పడింది. ఫ్రాన్స్‌కు చెందిన కాంపిటీషన్, ఫ్రాడ్ వాచ్డాగ్ 'డీజీసీసీఆర్ఎఫ్' ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
యాపిల్ ఈ జరిమానా కట్టడానికి అంగీకరించింది. అలాగే తన ఫ్రెంచ్ భాషా వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ప్రకటనను ఒక నెల పాటు ప్రచురించింది.
ఉద్దేశపూర్వకంగా..
వినియోగదారులు చాలా కాలంగా తమ ఐఫోన్ల పనితీరు నెమ్మదించడాన్ని గమనిస్తూనే ఉన్నారు. వినియోగదారులు కొత్త ఐఫోన్లు కొనుగోలు చేసేలా చేయడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని వారు గుర్తించారు.
మా ఉద్దేశం అదికాదు..
2017లో కొన్ని ఐఫోన్లు స్లోడౌన్ అయ్యాయని యాపిల్ ఒప్పుకుంది. అయితే ఇదంతా ఆయా ఫోన్ల జీవితకాలం పెంచడం కోసమే చేసినట్లు తెలిపింది.
యాపిల్ ఉద్దేశపూర్వకంగానే ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 7లకు ఓ సాఫ్ట్వేర్ అప్డేట్ పంపించింది. దీనిలో డైనమిక్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. దీని ద్వారా ఆయా ఐఫోన్లు స్లోడౌన్ అయ్యేలా యాపిల్ చేసింది.
కొత్తవి కొనాల్సిందే!
పాత ఐఫోన్లలో ఉండే లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం చాలా తక్కువ. దీనికి తోడు ఐఫోన్ అప్డేట్తో అవి మరింత స్లోడౌన్ అయ్యాయి. దీని వల్ల ఐఫోన్ల జీవితకాలం తగ్గుతుంది. ఫలితంగా వినియోగదారులు కచ్చితంగా కొత్త బ్యాటరీలు మార్చాల్సి ఉంటుంది. లేదా కొత్త ఫోన్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇదే యాపిల్ ఎత్తుగడ.
ఇదీ చూడండి: రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి:ఆర్థిక మంత్రి