ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కుటుంబ ఆధ్వర్యంలోని గేట్స్, మిలిందా ఫౌండేషన్‌లో ట్రస్టీగా ఉన్న మరో కుబేరుడు వారెన్ బఫెట్ ఆ పదవి నుంచి వైదొలిగారు. ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బఫెట్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దీనికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు.
గేట్స్, మిలిండా ఫౌండేషన్ లాంటి సంస్ధతో తన లక్ష్యాలు వంద శాతం సరిపోలుతాయన్న బఫెట్.. వీటిని సాధించడానికి తాను వ్యక్తిగతంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు. ఈ ఫౌండేషన్‌కు ఇటీవల సీఈవోగా నియమితులైన మార్క్ సుజ్‌మన్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకుంటున్నట్లు బిల్ గేట్స్, మిలిందా గేట్స్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే బఫెట్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.