ETV Bharat / business

వొడాఫోన్- ఐడియా పోస్ట్​పెయిడ్.. ఇక రెడ్!

వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థ పోస్ట్ పెయిడ్​​ సర్వీసు పేరుకు మార్పులు చేసింది. ఇక నుంచి బ్రాండ్​ పేరు నుంచి ఐడియా పదాన్ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రీపెయిడ్​ సర్వీసులు మాత్రం వొడాఫోన్, ఐడియాగా వేర్వేరు పేర్లతోనే కొనసాగుతాయని పేర్కొంది.

Vodafone Idea
వొడాఫోన్ ఐడియా పోస్ట్​పెయిడ్
author img

By

Published : Feb 7, 2020, 7:51 AM IST

Updated : Feb 29, 2020, 11:56 AM IST

టెలికాం సంస్థ వొడాపోన్​-ఐడియా తమ సర్వీసులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తమ పోస్ట్​పెయిడ్ సర్వీసుకు పేరు మారుస్తున్నట్లు ప్రకటించింది. ఐడియా అనే పదాన్ని తమ బ్రాండ్​ నేమ్​ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. ప్రీపెయిడ్ సర్వీసులు మాత్రం వొడాఫోన్, ఐడియా పేర్లతోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

దీనికి ప్రత్యామ్నాయంగా వొడాఫోన్-ఐడియా పోస్ట్​పెయిడ్​ వినియోగదారులందరికీ 'వొడాఫోన్​ రెడ్​ ప్లాన్'​ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. కొత్తగా చేరే వినియోగదారులకు నేరుగా వొడాఫోన్​ రెడ్​ ప్లాన్​ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతమున్న కస్టమర్లు ఆటోమేటిక్​గా ఈ ప్లాన్​కు మారతారని పేర్కొంది.

వొడాఫోన్​, ఐడియా సెల్యులార్​లు 2018లోనే విలీనమై వొడాఫోన్​ ఐడియా లిమిటెడ్​గా మారింది. కంపెనీ ప్రణాళికలో భాగంగానే వొడాఫోన్​ రెడ్​ ప్లాన్​ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించిందీ వ్యాపార సంస్థ.

ఇదీ చదవండి: యూట్యూబ్​లో 'డియర్​ కామ్రేడ్​' మరో రికార్డు

Intro:Body:

dd

Conclusion:
Last Updated : Feb 29, 2020, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.