ETV Bharat / business

వొడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం - వొడాఫోన్‌ ఐడియా అప్​గ్రేడేషన్​

వొడాఫోన్‌ ఐడియా (వీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 3జీ సేవలు పొందుతున్న యూజర్లను 4జీకి అప్‌గ్రేడ్‌ చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. 2జీ, 3జీ కస్టమర్లను 4జీకి అప్‌గ్రేడ్‌ చేసే సమయం ఆసన్నమైందని, అయితే, 2జీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామమని సంస్థ పేర్కొంది.

Voda-Idea-starts-upgrading-3G-users-to-4G
3జీ యూజర్లకు వొడా గుడ్‌న్యూస్‌
author img

By

Published : Sep 28, 2020, 9:03 AM IST

పోటీ కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌ 4జీ సేవల్లో దూసుకెళుతున్న నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా (వీఐ) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 3జీ సేవలు పొందుతున్న యూజర్లను 4జీకి అప్‌గ్రేడ్‌ చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. 2జీ, 3జీ కస్టమర్లను 4జీకి అప్‌గ్రేడ్‌ చేసే సమయం ఆసన్నమైందని, అయితే, 2జీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామమని వీఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 3జీ యూజర్లను దశలవారీగా వీఐ గిగా నెట్‌ టెక్నాలజీ ద్వారా 4జీకి అప్‌గ్రేడ్‌ చేసి, వేగవంతమైన డేటా అందిస్తామని తెలిపింది. ప్రధాన సర్కిళ్లలో అప్‌గ్రేడింగ్‌ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది.

అప్‌గ్రేడింగ్‌ ప్రక్రియ చేపట్టిన ప్రాంతాల్లో యూజర్లకు ఈ విషయాన్ని తెలియపరిచినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒక్క జూన్‌ నెలలోనే 48 లక్షల మంది చందాదారులను కోల్పోయిన ఆ కంపెనీ.. ఇతర కంపెనీలకు పోటీగా నిలిచేందుకు ముఖ్యంగా 16 ప్రధాన సర్కిళ్లపై దృష్టి పెట్టింది. ఆయా మార్కెట్లలో సబ్‌స్క్రైబర్లను, మార్కెట్‌ వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 4జీ సేవలను అప్‌గ్రేడ్‌ చేసే ప్రక్రియ చేపట్టింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.