ETV Bharat / business

మనదేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థకు అవినీతే పెద్ద అవరోధం: అషుతోష్​ చౌదరి - పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ ఇన్​ఛార్జ్​ అషుతోష్​ చౌదరి తాజా వార్త

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి అన్ని రంగాల వారు కలిసి పనిచేయాలని పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రీజినల్​ మేనేజర్​​ అషుతోష్​ చౌదరి తెలిపారు. అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా విజిలేంట్ ఇండియా... ప్రోస్పరస్​​ ఇండియా అనే నినాదంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు అవగాహన నడకను నిర్వహించారు.

vigilance awareness walk at necklace road in hyderabad
మనదేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థకు అవినీతే పెద్ద అవరోధం: అషుతోష్​ చౌదరి
author img

By

Published : Oct 27, 2020, 3:43 PM IST

అవినీతి మన దేశ ఆర్థిక రాజకీయ, సామాజిక పురోగతికి ఒక ప్రధాన అవరోధంగా మారిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు తెలుగు రాష్ట్రాల, కర్ణాటక రీజినల్​ మేనేజర్​ అషుతోష్ చౌదరి అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా విజిలేంట్ ఇండియా... ప్రోస్పరస్​​ ఇండియా అనే నినాదంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో చేపట్టిన అవగాహన నడకను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన నడకలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. అవినీతిని నిర్మూలించడానికి ప్రభుత్వం, పౌరులు, ప్రైవేటు రంగం అన్నీకలిసి పనిచేయవాల్సిన అవసరం ఉందని చౌదరి పేర్కొన్నారు. నిజాయితీతో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండండి... అన్ని సమయాల్లో సమగ్రత, అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఉద్యోగులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

ఇదీ చదవండి: ఈసారి వైద్యవిద్య రుసుముల పెంపు కోరుతున్న వైద్య కళాశాలలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.