కరోనా సెకండ్ వేవ్ వేళ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌కు డిమాండ్ ఏర్పడడంతో కొందరు వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు నకిలీలకు తెరలేపుతున్నారు. ఈ విధంగా లక్షకు పైగా నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయించిన కుంభకోణంలో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన వీహెచ్‌పీ నేత సహా మరో ఇద్దరిపై స్థానిక పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
జబల్‌పూర్ వీహెచ్‌పీ నేత అయిన సరబ్‌జీత్ సింగ్ మోఖాకు ఇదే నగరంలో ఓ ఆసుపత్రి కూడా ఉంది. ఇండోర్ నుంచి సుమారు 500 నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను తెప్పించి ఒక్కొక్కటీ రూ.35వేల నుంచి రూ.40వేల చొప్పున రోగుల బంధువులకు విక్రయించినట్లు సమాచారం. ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్న దేవేంద్ర చౌరాసియాతో పాటు, ఫార్మా కంపెనీలకు డీలర్‌గా వ్యవహరిస్తున్న స్వపన్ జైన్‌పై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. స్వపన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా.. మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు.
నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సీబీఐ దర్యాప్తు కోరుతోంది. గ్లూకోజ్, ఉప్పుతో తయారు చేసిన ఇంజక్షన్లను తమ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న ఈ ముఠాను తక్షణమే పట్టుకోవాలని డిమాండ్ చేసింది. ఈ అంతర్రాష్ట్ర కుంభకోణంపై సీబీఐ జోక్యం కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ఇవీ చదవండి: టీకా రికార్డ్: వేగంగా 17కోట్ల డోసుల పంపిణీ