కరోనా సంక్షోభంతో జూన్‌లో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు భారీగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 38 శాతం తగ్గి.. 1,26,417 యూనిట్లుగా నమోదైనట్లు ప్రకటించింది. గత ఏడాది జూన్‌లో ఈ సంఖ్య 2,05,011గా ఉన్నట్లు తెలిపింది.
ఇతర క్యాటగిరీ వాహనాల రిటైల్ విక్రయాలు ఇలా..
- 2020 జూన్‌లో ద్విచక్రవాహనాల అమ్మకాలు 40.92 శాతం తగ్గి 7,90,118 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2019 జూన్‌లో 13,37,462 యూనిట్లు అమ్ముడయ్యాయి.
- వాణిజ్య వాహనాల విక్రయాలు 2020 జూన్‌లో ఏకంగా 83.83 శాతం పడిపోయాయి. గత నెల 10,509 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 జూన్‌లో 64,976 యూనిట్లు విక్రయమవ్వడం గమనార్హం.
- త్రిచక్ర వాహనాల విక్రయాలు ఈ ఏడాది జూన్‌లో 75.43 శాతం తగ్గి 11,993 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2019 జూన్‌లో 48,804 త్రిచక్ర వాహనాలు అమ్మడయ్యాయి.
- అన్ని క్యాటగిరీల్లో కలిపి 2020 జూన్‌లో మొత్తం 9,84,395 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది నమోదైన 16,97,166 వాహన విక్రయాలతో పోలిస్తే.. ఇవి 42 శాతం తక్కువ.
సమయానికి వర్షాలు పడటం, లాక్డౌన్ సడలిపులు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ డిమాండ్‌తో ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం జూన్‌లో 10 శాతానికిపైగా పెరిగినట్లు ఫాడా తెలిపింది.
ఇదీ చూడండి:బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న రాహుల్