ETV Bharat / business

పట్టణాల్లో పనుల్లేవ్​.. నిరుద్యోగం పెరుగుతోంది! - దేశంలో నిరుద్యోగ రేటు

కరోనా సంక్షోభంతో దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. లాక్​డౌన్ సడలింపులతో ఇటీవల కాస్త తగ్గుతూ వచ్చిన నిరుద్యోగిత శాతం.. జూన్​ 5తో ముగిసిన వారానికి మళ్లీ 11.26 శాతానికి పెరిగినట్లు ఓ సర్వేలో తెలిపింది.

corona impact on jobs
కరోనాతో పెరిగిన నిరుద్యోగం
author img

By

Published : Jul 7, 2020, 3:16 PM IST

కరోనా వల్ల దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా పీడిస్తోంది. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు ఓ సర్వేలో తెలిసింది.

దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు నాలుగు వారాలుగా తగ్గుముఖం పట్టగా.. జులై 5తో ముగిసిన వారంలో మళ్లీ 11.26 పెరిగినట్లు సెంటర్​ ఫర్​ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదికలో పేర్కొంది. అంతకు ముందు వారం నిరుద్యోగిత రేటు 10.69 శాతంగా ఉంది.

నిరుద్యోగిత పెరిగేందుకు కారణాలు..

దేశవ్యాప్తంగా కరోనా లాక్​డౌన్​తో కొన్ని నెలలుగా నిరుద్యోగిత భారీగా పెరుగుతోంది. ఇటీవల లాక్​డౌన్ సడలింపులతో కాస్త తక్కుముఖం పట్టింది. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల కర్ణాటక, తమిళనాడు, అసోం, బంగాల్, మహారాష్ట్రల్లో విధించిన తాజా ఆంక్షలతో ఉపాధి అవకాశాలు తగ్గినట్లు సర్వే విశ్లేషించింది.

సంఘటిత రంగాల్లోనూ అనిశ్చితి..

ఆరోగ్యం, కార్మికుల కొరత, డిమాండ్ ​లేమి వంటి కారణాలతో సంఘటిత రంగాల్లోనూ ఉద్యోగాలపై ప్రభావం చూపినట్లు సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చాలా నెలల సమయం పడుతుందని అంచనా వేసింది. కరోనా కాలంలో సొంతూళ్లకు పయనమైన వలస కార్మికులు తిరిగి పట్టణాలకు వచ్చేందుకు మరో ఆరు నెలల సమయం పట్టొచ్చని తెలిపింది.

నిరుద్యోగం నెలల వారీగా..

ఏప్రిల్​లో 17.7 మిలియన్ల మంది వేతన జీవులు ఉపాధి కోల్పోయారు. మేలో ఇది 17.8 మిలియన్లకు పెరిగింది. లాక్​డౌన్ సడలింపులతో జూన్​లో 3.9 మిలియన్ల ఉద్యోగాలు రికవరీ అయ్యాయి.

ఇదీ చూడండి:క్యూ2లో శాంసంగ్ లాభం 23 శాతం వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.