ETV Bharat / business

గృహ మార్కెట్​లో పెరుగుతున్న గిరాకీ - కొత్త ప్రాజెక్టులు

గృహ మార్కెట్​లో ప్రస్తుతం గిరాకీ పెరుగుతోందని ప్రాప్​టైగర్​ నివేదిక వెల్లడించింది. విక్రయాలతో పాటు నూతన ప్రారంభాలూ 2020 అక్టోబరు-డిసెంబరు నెలల్లో కనిపించాయని పేర్కొంది. హైదరాబాద్​, బెంగళూరు, చెన్నైలలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

Unsold housing stocks down 9pc in 2020 at 7.18 lakh units; builders may take 4yrs to exhaust
గృహా విక్రయాలు తగ్గుతున్నాయ్..
author img

By

Published : Jan 12, 2021, 6:49 AM IST

గత ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో స్తబ్దుగా ఉన్న గృహ మార్కెట్​లో ప్రస్తుతం గిరాకీ పెరుగుతోందని ప్రాప్​టైగర్​ నివేదిక వెల్లడించింది. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్​, బెంగళూరు, చెన్నైలలో ఇది అధికంగా ఉందని తెలిపింది. విక్రయాలతో పాటు నూతన ప్రారంభాలూ 2020 అక్టోబరు-డిసెంబరు నెలల్లో కనిపించాయని పేర్కొంది. దేశంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టులు ఈ మూడు నగరాల్లో 43శాతం వరకు ఉన్నాయని, అమ్మకాల పరంగానూ 29శాతం వరకు ఇక్కడే కనిపించాయని తెలిపింది.

మిగతా అన్ని నగరాల్లో ధరలు తగ్గుతుంటే.. హైదరాబాద్​లో మాత్రం ధరల్లో వృద్ధి కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఇక్కడి మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టులే ఇందుకు కారణమని తెలిపింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో అత్యధిక ప్రాజెక్టులు హైదరాబాద్​లోనే ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ కాలంలో హైదరాబాద్​లో కొత్తగా 12,723 నివాస గృహాల నిర్మాణం ప్రారంభమవగా.. 6,487 ఇళ్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఆఫీసు కార్యకలాపాల పరంగా హైదరాబాద్​ పశ్చిమ ప్రాంతంలో సరఫరా, గిరాకీ అధికంగా ఉంది. హైదరాబాద్​లో ఏడాదిలో 5శాతం వరకు ధరలు పెరిగాయని పేర్కొంది.

ఇదీ చదవండి: పసిడి బాండ్ల జారీ షురూ- వారికి ప్రత్యేక డిస్కౌంట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.