ETV Bharat / business

90 శాతం తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు - హర్దీప్‌సింగ్‌ పురి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి

2019తో పోల్చేతే 2020 మార్చి నుంచి డిసెంబర్​ వరకు దేశంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు 90 శాతానికి పైగా తగ్గినట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పురి తెలిపారు. దీనివల్ల విమాన ప్రయాణాల ఆదాయం 2019లో రూ. 46,711 కోట్లు ఉండగా, 2020లో రూ. 11,810కోట్లకు పరిమితమైందని అన్నారు.

international flights in the country
90శాతం తగ్గిన అంతర్జాతీయ ప్రయాణాలు
author img

By

Published : Feb 10, 2021, 6:58 PM IST

దేశంలో 2019తో పోలిస్తే గతేడాది మార్చి నుంచి డిసెంబరు వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు 90.56 శాతం తగ్గినట్లు కేంద్రం తెలిపింది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి భారత్‌లో విమాన ప్రయాణాలను నిలిపేశారు. దీంతో 2020లో మార్చి నుంచి డిసెంబరు వరకూ ప్రయాణించిన వారి సంఖ్య 18.55 లక్షలకు పరిమితమైంది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి బుధవారం రాజ్యసభలో వెల్లడించారు.

దేశీయంగా 2019లో సుమారు 12 కోట్ల మంది ప్రయాణాలు చేయగా, 2020లో అది 3.77కోట్లకే పరిమితమైందని తెలిపారు. మార్చిలో ప్రకటించిన అంతర్జాతీయ ప్రయాణాల నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ 2020 జులై నుంచి ఎయిర్‌బబుల్‌ ఒప్పందంలో భాగంగా కొన్ని దేశాలకు విమాన ప్రయాణాలకు అనుమతినిచ్చారు.

విమాన ప్రయాణాల ఆదాయం 2019లో రూ. 46,711 కోట్లు ఉండగా, 2020లో రూ. 11,810కోట్లకు పరిమితమైంది. 2019లో 11,99,45,632 మంది విమానాల్లో ప్రయాణాలు సాగించగా, 2020లో 3,77,79,592 మంది ప్రయాణించారు.

-హర్దీప్ ‌సింగ్‌ పురి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి

గతేడాది మార్చి 25 నుంచి మే 24 వరకు దేశీయ విమాన ప్రయాణాలను కేంద్రం రద్దు చేసింది. అనంతరం 80శాతం కన్నా తక్కువ మంది ప్రయాణికులతో విమానాలను నడిపేందుకు అనుమతినిచ్చారు.

ఇదీ చూడండి: 'ఇకపై ఫాస్టాగ్​లో కనీస నగదు నిల్వ అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.