ETV Bharat / business

దేశంలో భారీగా పెరిగిన నిరుద్యోగం రేటు - భారతదేశంలో కరోనా వైరస్

లాక్​డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది జీవనోపాధి కోల్పోయారు. నిరుద్యోగం గణనీయంగా పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు, గ్రామాల్లో కార్మిక భాగస్వామ్య రేటు భారీగా పడిపోయాయి. ప్రభుత్వాలు నెమ్మదిగా సడలింపులు ఇస్తున్నా ఆర్థిక రంగం పుంజుకోవటానికి చాలా కాలం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితుల్లో సత్వర మార్పు సాధ్యం కాదంటున్నారు.

Unemployment rate
నిరుద్యోగం
author img

By

Published : May 21, 2020, 3:46 PM IST

దేశంలో కరోనా లాక్​డౌన్​ కారణంగా నిరుద్యోగం పెరుగుతోంది. ఏప్రిల్ 20 నుంచి సడలింపులు ఇస్తూ రావటం కొంత సానుకూల ప్రభావం చూపించినా.. నిరుద్యోగిత రేటు పెరుగుదల కొనసాగుతూనే ఉంది.

సెంటర్​ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం గతవారం దేశంలో నిరుద్యోగిత రేటు 24 శాతం గానమోదైంది. ఇది ఏప్రిల్​లో నమోదైన రేటుకు సమానం.

కార్మికుల ఉపాధి..

అయినప్పటికీ సడలింపుల వల్ల కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం అధికంగా ఉంటుంది. ఫలితంగా భారీగా పడిపోయిన కార్మికుల భాగస్వామ్య రేటు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఏప్రిల్​ చివరి వారంలో ఇది 35.4 శాతం, మే మొదటి వారంలో 36.2 శాతం, రెండో వారంలో 37.6 శాతం, గతవారం 38.8 శాతం నమోదైంది.

లాక్​డౌన్​ ఎత్తివేత తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలని సీఎంఐఈ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు చాలా కాలం పడుతుందని అంచనా వేసింది.

పట్టణ, గ్రామాల్లో నిరుద్యోగం..

భారత్​లో కరోనా సంక్షోభం, లాక్​డౌన్ కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయారు. గ్రామాల్లో నిరుద్యోగిత రేటు 23 శాతం ఉండగా.. పట్టణాల్లో అత్యధికంగా 27 శాతం ఉంది. కార్మిక భాగస్వామ్య రేటు మాత్రం గ్రామాల్లో అధికంగా 41 శాతం నమోదైంది. అదే పట్టణాల్లో 34 శాతంగా ఉంది. అయితే పట్టణాల్లో నైపుణ్య కార్మికులు అధికంగా ఉన్నారు.

"ప్రస్తుత ఏడాదికి జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.40 వేల కోట్ల కేటాయించారు. ఈ ఏడాది బడ్జెట్​లో ప్రకటించిన రూ.61.5 వేల కోట్లకు ఇది అదనం. దీనివల్ల గ్రామీణ కార్మికులకు లాభం చేకూరనుంది. ఈ పథకం ద్వారా 2020-21 ఏడాదిలో 300 కోట్ల పని గంటలు లభిస్తాయి. గతేడాది రూ.71 వేల కోట్లతో 265 కోట్ల పని గంటలు సృష్టించారు."

-సీఎంఐఈ నివేదిక

గతేడాదిలో గ్రామీణ ప్రాంతాల్లో 27.6 కోట్ల మంది ఉపాధి పొందారు. లాక్​డౌన్​ వల్ల ఈ సంఖ్య 19.7 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం చేసిన కేటాయింపుల వల్ల దీనికి అదనంగా మరో 10 శాతం మంది ఉపాధి లభించనుందని సీఎంఐఈ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా కేటాయింపుల్లో 13 శాతం వేతనాల పెంపునకు వెళుతుందని తెలిపింది.

"ఫలితంగా ఈ పథకం వల్ల అదనంగా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. జాతీయ ఉపాధి హామీ ద్వారా మొత్తం ఈ ఏడాది 21.6 కోట్ల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇది గ్రామీణ భారతానికి ఎంతోకొంత సహాయంగా ఉంటుంది. వలస కూలీలకు ఆసరాగా నిలుస్తుంది. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది." అని సీఎంఐసీ అభిప్రాయపడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.