పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. వరుసగా ఐదోసారి నీరవ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది న్యాయస్థానం. భారత్‌కు నీరవ్‌ను అప్పగించే కేసు మేలో విచారణకు రానున్న నేపథ్యంలో.. ఈ వజ్రాల వ్యాపారి ఐదోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. అయినా ఫలితం దక్కలేదు.
భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 2 బిలియన్ డాలర్ల మేర కచ్చుటోపీ పెట్టి.. దేశం విడిచి పరారైనట్లు నీరవ్ మోదీపై అభియోగాలున్నాయి.
గత ఏడాది మార్చి 19న లండన్‌లో నీరవ్‌ను అరెస్టు చేశారు స్థానిక పోలీసులు.
ఇదీ చూడండి:'హెచ్-1బీ' వీసా తిరస్కరణలో భారతీయ టెక్ కంపెనీలే టాప్!