ETV Bharat / business

ఫిక్కీ అధ్యక్షుడిగా ఉదయ్​ శంకర్ బాధ్యతలు

author img

By

Published : Dec 14, 2020, 5:56 PM IST

2020-21 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య 'ఫిక్కీ' కొత్త నాయకత్వం సోమవారం బాధ్యతలు స్వీకరించింది. స్టార్ ఇండియా ఛైర్మన్ ఉదయ్ శంకర్ ఫిక్కీ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

FICCI New Leadership
ఫిక్కీ నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్

మీడియా రంగ ప్రముఖుడు ఉదయ్ శంకర్​ పరిశ్రమల సమాఖ్య 'ఫిక్కీ' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2020-21కి గాను ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఉదయ్​ శంకర్ ప్రస్తుతం వాల్ట్​ డిస్నీ ఆసియా పసిఫిక్ ప్రాంత అధ్యక్షుడిగా, స్టార్​&డిస్నీ ఇండియా ఛైర్మన్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31న ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు ఉదయ్​ శంకర్.

సోమవారమే హిందుస్థాన్​ యునీలీవర్​ ఛైర్మన్, ఎండీ సంజీవ్ మెహతా.. ఫిక్కీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఇండియన్​ మెటల్స్&ఫెర్రో అల్లోయిస్​ ఎండీ సుబ్రకాంత్ పాండా వ్యవహరించనున్నారు.

ఇప్పటి వరకు ఫిక్కీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ సంగీతా రెడ్డి.. ఉదయ్ శంకర్​ సహా, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి:భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.