నూతన డిజిటల్ నిబంధనలపై ట్విట్టర్‌కు భారత ప్రభుత్వం చివరి నోటీసు ఇచ్చింది. మే 26 నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ట్విట్టర్ సంస్థ ఇంతవరకు నోడల్, గ్రీవెన్స్, చీఫ్ కంప్లయన్స్ అధికారిని నియమించలేదని కేంద్రం పేర్కొంది.
తక్షణమే నియమాలను పాటించకుంటే అనాలోచిత పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఐటీ చట్టం ప్రకారం జవాబుదారీతనం నుంచి మినహాయింపును సంస్థ కోల్పోతుందని పేర్కొంది.
"నిబంధనలను ట్విట్టర్ పాటించకపోవడాన్ని చూస్తే.. భారత్‌లో వినియోగదారులకు రక్షణ కల్పించడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ సొంత దేశం తర్వాత ఎక్కువ ఆదరణ లభించిన భారత్‌లో దశాబ్దకాలంగా సంస్థ సేవలందిస్తోంది. అయినప్పటికీ, ఈ ప్లాట్‌ఫాంలో తలెత్తిన సమస్యలను పారదర్శకంగా పరిష్కరించుకునే అవకాశం యూజర్లకు కల్పించడం లేదు."
-కేంద్ర ఐటీ శాఖ
సద్భావనతో చివరిసారిగా నోటీసులు అందిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఇకపైనా నిబంధనలు పాటించకుంటే ఐటీ చట్టం, ఇతర చట్టాల ప్రకారం చర్యలు ఉంటాయని తేల్చిచెప్పింది. అయితే, ఇందుకు తుది గడువు గురించి నోటీసులో ప్రస్తావించలేదు.
ఇదీ చదవండి- గూగుల్ కొత్త ఆప్షన్‌తో యాడ్స్‌కు చెక్!