ETV Bharat / business

'మా ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్​' - కరోనా టీకా

తమ ఉద్యోగులందరికీ కరోనా టీకాను ఉచితంగా ఇవ్వనున్నట్లు టీవీఎస్​ మోటార్స్​​ ప్రకటించింది. తమ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపింది. ఇప్పటికే రిలయన్స్, పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కరోనా టీకాను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి.

TVS offers free vaccination
ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్​ ఫ్రీ: టీవీఎస్​
author img

By

Published : Mar 6, 2021, 7:52 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా టీకా ఉచితంగా ఇవ్వనున్నట్లు ద్విచక్ర, త్రి చక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్​ తెలిపింది. దీనివల్ల తమ కంపెనీలో పని చేస్తోన్న 35,000 ఉద్యోగులు లబ్ది పొందుతారని పేర్కొంది.

మా సంస్థలో పని చేసే ఉద్యోగుల భద్రతకు మేము అత్యంత ప్రాధాన్యతనిస్తాం. అందుకే సంస్థలో పని చేసే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా టీకాను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

ఆనంద క్రిష్ణన్​, టీవీఎస్​ మోటార్​ కంపెనీ, హ్యూమన్​ రీసౌర్స్​(హెచ్​ఆర్​) వైస్​ ప్రెసిడెంట్​

మొదటి దశలో 60 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు టీకా ఇస్తామని ప్రకటించింది. అంతేకాకుండ 45ఏళ్లు ఆ పైన ఉండి తీవ్రఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వాక్సిన్​ ఇస్తామని తెలిపింది.

భారత్​లోనే అతి పెద్ద పారిశ్రామిక దిగ్గజ సంస్థ రిలయన్స్​ ఇప్పటికే వారి ఉద్యోగులకు కరోనా టీకాను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సాఫ్ట్​వేర్​ సంస్థలు.. ఇన్ఫోసిస్​, యాక్సెన్చర్​ కూడా తమ ఉద్యోగులకు కరోనా టీకాను ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించాయు.

ఇదీ చూడండి: అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.