ETV Bharat / business

పెట్రోల్, డీజిల్​పై పన్నులు ఎంత శాతం తగ్గాయంటే.. - పెట్రోల్ డీజిల్ వార్తలు

కేంద్రం పెట్రోల్​పై రూ.5. డీజిల్​పై రూ.10మేర ఎక్సైజ్ సుంకంలో కోత విధించాక వీటిపై విధిస్తున్న మొత్తం పన్నుల శాతం భారీగా తగ్గింది. అంతకుముందు పెట్రోల్​పై 54శాతంగా ఉన్న పన్నులు ఇప్పుడు 50కి పడిపోయాయి. అలాగే డీజిల్​పై పన్నుల శాతం కూడా 48 నుంచి 40కి దిగొచ్చింది.

Total tax on petrol down to 50 pc, diesel to 40 pc after duty cuts
ఎక్సైజ్ సుంకంలో కోతతో పెట్రోల్, డీజిల్​పై తగ్గిన పన్నుల శాతం
author img

By

Published : Nov 7, 2021, 3:29 PM IST

కేంద్రం పెట్రోల్​​, డీజిల్​పై ఎక్సైజ్ సుంకం తగ్గించాక వాటిపై విధిస్తున్న పన్నుల శాతం(total tax on petrol) 50, 40కి దిగొచ్చింది. పలు రాష్ట్రాల్లో వ్యాట్​ను కూడా తగ్గించడం వల్ల ఈ పన్నుల శాతం అక్కడ ఇంకాస్త తక్కువగానే ఉంది(total tax on diesel).

అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరకు రవాణా ఛార్జీలు జోడిస్తే అది ప్రాథమిక ధర. దీనికి కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్​, డీలర్లకు చెల్లించే కమీషన్​ను జతచేసి పెట్రోల్, డీజిల్ రిటైల్​ ధరను నిర్ణయిస్తారు.

చమురు ధరలు తగ్గడానికి ముందు నవంబర్​ 3వరకు లీటర్​ పెట్రోల్​పై కేంద్రం రూ.32.90 ఎక్సైజ్ సుంకం విధించేది(total tax on petrol in india). దిల్లీ ప్రభుత్వం 30శాతం వ్యాట్ వసూలు చేసింది. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్​పై పన్నుల శాతం 54గా ఉండేది. అయితే కేంద్రం ఎక్సైజ్​ సుంకంలో కోత విధించి పెట్రోల్​ ధరను రూ.5 తగ్గించాక ఇది 50శాతానికి దిగొచ్చింది. కేంద్రం నిర్ణయం తర్వాత దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వ్యాట్​ను తగ్గించాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్​పై పన్నుల శాతం 50 కంటే ఇంకాస్త తక్కువగానే ఉంది.

అలాగే డీజిల్​పై కూడా కేంద్ర ఎక్సైజ్​ సుంకం లీటర్​కు రూ.31.8గా ఉండేది. దిల్లీ ప్రభుత్వం విధించే 16.75శాతం వ్యాట్​, ఎయిర్​ యాంబియెన్స్​ ఛార్జీతో కలిపి డీజిల్​పై పన్నుల శాతం నవంబర్ 3వరకు 48శాతంగా ఉంది(total tax on diesel in india). అయితే కేంద్రం డీజిల్​పై ఎక్సైజ్​ సుంకంలో రూ.10 కోత విధించాక దీనిపై పన్నుల శాతం దిల్లీలో 40శాతానికి దిగొచ్చింది. వ్యాట్ తగ్గించిన ఇతర రాష్ట్రాల్లో ఈ శాతం ఇంకా తక్కువే.

చుమురు ధర, రవాణా ఛార్జీలతో కలిపి కనీస ఇంధన ధర రూ.52 నుంచి రూ.59.89 మధ్య ఉంటుంది(petrol diesel price). రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను బట్టి ఈ ధరలో వ్యత్యాసం ఉంటుంది. అయితే కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల వ్యాట్​తో కలిపి చమురు ధరలు పెరుగుతాయి(petrol price in india).

రాజస్థాన్లో అత్యధికం..

రాజస్థాన్ పెట్రోల్​పై అత్యధికంగా రూ.30.51వ్యాట్ విధిస్తోంది. ఆ తర్వాత మహరాష్ట్ర రూ.29.99, ఆంధ్రప్రదేశ్​ రూ.29.02, మధ్యప్రదేశ్​ రూ.26.87 వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నాయి. అత్యల్పంగా అండమాన్ నికోబార్​ పెట్రోల్​పై రూ.4.93 మాత్రమే వ్యాట్ విధిస్తోంది.

డీజిల్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా రూ.21.19 వ్యాట్ వసూలు చేస్తోంది. ఆ తర్వాత రాజస్థాన్​ రూ.21.14, మహారాష్ట్ర రూ.20.21 వ్యాట్​ విధిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్​ డీజిల్​పై అత్యల్పంగా రూ.4.40 వ్యాట్ వసూలు చేస్తోంది. ఆ తర్వాత అండమాన్ నికోబార్​లో ఇది​ రూ.4.58గా ఉంది.

ఈ సుంకాలతో పాటు పెట్రోల్​ బంకు డీలర్లకు లీటర్​ పెట్రోల్​కు రూ.3.85, డీజిల్​కు రూ.2.58 కమీషన్ చెల్లిస్తారు.

భాజపా పాలిత రాష్ట్రాల్లో..

కేంద్రం ఎక్సైజ్​ సుంకం తగ్గించాక భాజపా పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ను(total tax on diesel in india) రూ.8.7, రూ.9.52 మేర తగ్గించాయి. లాద్దాక్​, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కేంద్రం స్థాయిలోనే పన్నులో కోత విధించాయి. దీంతో ఇతర రాష్ట్రాలతో పోల్చితే భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇంధన ధరలు భారీగా తగ్గాయి.

ఎక్సైజ్ సుంకం కంటే వ్యాట్​ను ఎక్కువగా తగ్గించిన రాష్ట్రాల్లో కర్ణాటక, పుదుచ్చేరి, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్​, నాగలాండ్​, త్రిపుర, అసోం, సిక్కిం, బిహార్​, మధ్యప్రదేశ్ ఉన్నాయి. గోవా, గుజరాత్​, దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్, చండీగడ్​, హరియాణా, హిమాచల్​ ప్రదేశ్, జమ్ముకశ్మీర్​, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​, ఒడిశా, లద్దాక్​ కూడా వ్యాట్​లో కోత విధించాయి.

వ్యాట్ తగ్గించని రాష్ట్రాలు..

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాజస్థాన్​, పంజాబ్​, ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, ఝార్ఖండ్​, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాట్​ను తగ్గించలేదు. అలాగే ఆప్ అధికారంలో ఉన్న దిల్లీ, టీఎంసీ పాలిత రాష్ట్రం బంగాల్, వామపక్షాలు పాలిస్తున్న కేరళ, తెరాస​​ అధికారంలో ఉన్న తెలంగాణ, వైకాపా ప్రభుత్వమున్న ఆంధ్రప్రదేశ్​లో వ్యాట్​ను తగ్గించలేదు.

అన్ని సుంకాలతో కలిపి దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా రాజస్థాన్​లో ఉంది. జైపుర్​లో లీటర్​ పెట్రోల్​ను రూ.111.10కి విక్రయిస్తున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముంబయిలో పెట్రోల్ ధర రూ.109.98గా ఉంది. ఆంధ్రప్రదేశ్​లో రూ.109.09గా ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్​, బిహార్​, లద్దాక్​ మినహా భాజపా దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100లోపే ఉంది.

ఇదీ చదవండి: పెట్రో పీడనకు సరైన విరుగుడు అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.