ETV Bharat / business

డీమ్యాట్​ ఖాతా తెరవాలా.. వీటిని ట్రై చేయండి - ఉచిత డీమ్యాట్​ అకౌంట్ తెరవడం ఎలా

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు డీమ్యాట్ ఖాతా తెరవాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. దేశంలో డీమ్యాట్, స్టాక్ బ్రోకింగ్ సేవలందించే 5 ఉత్తమ కంపెనీలు, వాటి ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

how to open dmat
డీమ్యాట్​ ఖాతా తెరవడం ఎలా
author img

By

Published : Jul 5, 2020, 1:30 PM IST

ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే వారికి కచ్చితంగా డీమ్యాట్ ఖాతా ఉండాలి. స్టాక్ బ్రోకరేజీ సంస్థలు వీటిని అందిస్తుంటాయి. ప్రస్తుతం దేశంలో చాలా సంస్థలు ఈ సేవలు ఇస్తున్నాయి. అందులో ఎక్కువ మంది వినియోగించేవి.. కొత్తగా ట్రేడింగ్ చేయాలనుకునే వారికి ఉత్తమమైన బ్రోకరేజీ సేవలందించే సంస్థలు, వాటి ఛార్జీల గురించి తెలుసుకుందాం.

జెరోధా

  • దేశీయంగా అతిపెద్ద రిటైల్ స్టాక్ బ్రోకింగ్ సంస్థల్లో జెరోధా అగ్ర స్థానంలో ఉంది.
  • ఆధార్​, పాన్ కార్డు ఉంటే జెరోధాలో డీమ్యాట్​ ఖాతా తెరవచ్చు. ఆన్​లైన్​లో ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
  • రూ.100తో డీమ్యాట్ ఖాతా ప్రారంభించేందుకు వీలుంది.
  • జెరోధాలో బ్రోకరేజి ఛార్జీ లావాదేవీకి రూ.20 చొప్పున వసూలు చేస్తారు.
  • డీమ్యాట్ ఖాతా వార్షిక నిర్వహణ ఛార్జీలు (ఏఎంసీ) రూ.300.
  • జెరోధా మొబైల్​యాప్​ ద్వారా షేర్ల కొనుగోలు, విక్రయం జరపొచ్చు.

అప్​స్టాక్స్​

  • ఇటీవలి కాలంలో ఎక్కువ మందికి చేరువైన డీమ్యాట్ బ్రోకరేజీల్లో ఇదీ ఒకటి. గతంలో ఇది ఆర్​కేఎస్​వీ పేరుతో బ్రోకరేజీ సేవలందించేది.
  • పరిమిత కాల ఆఫర్ కింద ప్రస్తుతానికి ఉచితంగా డీమ్యాట్​ ఖాతాను ఇస్తోంది అప్​స్టాక్స్. ఆన్​లైన్​లోనే ఖాతా తెరిచే ప్రక్రియ సులభంగా పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తోంది.
  • విశ్లేషణలతో కూడిన పెట్టుబడి సేవలనూ అందిస్తోంది.
  • ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది అప్​స్టాక్స్.
  • అప్​స్టాక్స్​తో మ్యూచువల్ ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు.
  • వార్షిక నిర్వహణ రుసుము రూ.150గా ఉంది.
  • డెలివరీ ట్రేడింగ్​ ఉచితంగా, లావాదేవీ ఛార్జీలు రూ.20గా ఉన్నాయి.
  • మొబైల్ యాప్​ ద్వారా సులభంగా అప్​స్టాక్స్​లో ట్రేడింగ్ చేసేందుకు వీలుంది.

ఏంజెల్ బ్రోకింగ్

దేశంలో 30 సంవత్సరాల నుంచి స్టాక్ బ్రోకింగ్ సేవలందిస్తోంది ఏంజెల్ బ్రోకింగ్.

  • ప్రస్తుతం ఈ సంస్థ ఉచితంగా డీమ్యాట్​ ఖాతా ఇస్తోంది.
  • ఆన్​లైన్​లో చేసే లావాదేవీలపై 20శాతం వరకు తగ్గింపు ఇస్తుంది.
  • ఏంజెల్ బ్రోకింగ్​లో ఉన్న ఉత్తమమైన ఫీచర్ ఏమిటంటే.. తమ వినియోగదారులకు ఉచితంగా పెట్టుబడి సలహాలను ఎస్​ఎంఎస్​ ద్వారా అందిస్తుంది. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ ఫీచర్​ ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • ఏకకాలంలో రూ.2,500 నిర్వహణ రుసుము చెల్లిస్తే.. జీవితకాలం పాటు డీమ్యాట్ ఖాతను ఉచితంగా వినియోగించుకునే వీలుంది.
  • మొబైల్ యాప్ ​ద్వారా లావాదేవీలు సులభంగా జరపొచ్చు.

మోతీలాల్ ఓస్వాల్

  • దేశీయంగా ఈ సంస్థ కుడా 30 ఏళ్లకు పైనుంచే బ్రోకరేజీ సేవలందిస్తోంది.
  • ఈ సంస్థ కూడా డీమ్యాట్​ ఖాతాను ఉచితంగా అందిస్తోంది.
  • ఖాతా వార్షిక నిర్వహణ ఛార్జీల కింద రూ. 441గా ఉంచింది.
  • ఖాతాను తెరిచిన మొదటి నెల ఉచిత బ్రోకరేజ్ (పరిమిత కాల ఆఫర్) సర్వీసును అందిస్తోంది.
  • ఈక్విటీ ఇంట్రా-డే ట్రేడింగ్ బ్రోకరేజ్ ఛార్జ్ 0.03 శాతం నుంచి 0.015 శాతంగా ఉంటుంది.

షేర్ ఖాన్

  • స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ కంపెనీల్లో ప్రధానంగా వినిపించే పేరు షేర్​ ఖాన్​.
  • షేర్​ ఖాన్ ప్రస్తుతం ఉచితంగా డీమ్యాట్​ ఖాతాను ఇస్తోంది.
  • డీమ్యాట్ వార్షిక నిర్వహణ ఛార్జీ రూ. 400 ఉంది.
  • ఈక్విటీ ఇంట్రా-డే ట్రేడింగ్ బ్రోకరేజ్ ఛార్జ్ 0.1 శాతంగా ఉంచింది షేర్​ఖాన్​.

గమనిక: డీమ్యాట్​ ఖాతా తెరిచే ముందే ఆయా సంస్థలు ఏవైనా హిడెన్ ఛార్జీలు విధిస్తున్నాయా? అని తెలుసుకోవాలి. అలాంటి ఛార్జీలు లేకుండా సేవలందించే డీమ్యాట్​ ఖాతాను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

ఇదీ చూడండి:అంతర్జాతీయ పరిణామాలే ఈ వారం మార్కెట్లకు కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.