బంగారం (Gold Price today), వెండి ధరలు క్రితం రోజుతో పోల్చితే.. శనివారం భారీగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.240ఎగబాకింది. కిలో వెండి ధర ఏకంగా రూ.270 ఎగసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్లో పది గ్రాముల పసిడి ధర(Gold Price in Hyderabad) రూ.50,840గా ఉంది. కిలో వెండి ధర రూ.68,900 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు(Gold Price in Vijayawada) రూ.50,840కు, కేజీ వెండి ధర రూ.68,900కు చేరింది.
- విశాఖపట్నంలో పది గ్రాములకు పుత్తడి ధర(Gold Price in Vizag) రూ.50,840గా ఉంది. కిలో వెండి ధర రూ.68,900కు పెరిగింది.
అంతర్జాతీయంగా..
అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పెరిగాయి.
- ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1864.70 డాలర్లుగా ఉంది.
- ఔన్సు స్పాట్ వెండి ధర 25.33 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్ రూ.110.33 కాగా.. డీజిల్ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.17గా ఉంది.
ఇదీ చదవండి:తల్లిదండ్రుల అప్పు తీర్చాలని బాలుడికి బ్యాంక్ నోటీసులు