ETV Bharat / business

స్మార్ట్​ వాచ్​ కొనేముందు ఇవి తెలుసుకోండి.. - స్మార్ట్​ వాచ్ సమాచారం తెలుగులో

మార్కెట్లో చాలా స్మార్ట్ వాచ్​లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యం గురించిన అంశాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే ఈ స్మార్ట్ వాచ్​లను కొనుగోలు చేస్తున్నప్పుడు ఎలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి? మార్కెట్లో ఉన్న టాప్ 5 స్మార్ట్ వాచ్​లు ఏవో తెలుసుకుందాం.

smart watch
స్మార్ట్​ వాచ్
author img

By

Published : Apr 20, 2021, 10:14 AM IST

ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఇంట్లో వాడే టార్చ్​లైట్​, చేతిలో ఉండే మొబైల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు.. అంతా స్మార్ట్ అయిపోయాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి ఫిట్​నెస్ బ్యాండ్​లు, స్మార్ట్​ వాచ్​ల దైనందిన జీవితంలో భాగం అయిపోయాయి. హృదయ స్పందన, ఆక్సిజన్ స్థాయి, నిద్ర నాణ్యత తదితర విషయాలు తెలుసుకోవటం ఒకప్పుడు కష్టంగా ఉండేది. ఇప్పుడు స్మార్ట్ వాచ్​లతో ఆ పని సులభమైంది. స్మార్ట్ వాచ్​ ఎంపిక.. బడ్జెట్ ధరల్లో ఉన్న మంచి వాచ్​లు వివరాలపై ప్రత్యేక కథనం..

ఓఎస్​-ఫోన్ కంపాటిబిలిటీ

స్మార్ట్ వాచ్​ను ఫోన్​కు కనెక్ట్ చేసుకోవటం ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఓ రకంగా ఇవి మన ఫోన్​కు ఎక్స్​టెన్షన్ లాంటివనే చెప్పాలి. కొన్ని వాచ్​లు కొన్ని రకాల ఫోన్లతో మాత్రమే పనిచేస్తాయి. ఉదాహరణకు ఆపిల్ వాచ్​లు ఐఫోన్లతో మాత్రమే పనిచేస్తాయి. అదే సమయంలో గూగుల్ వియర్ ఓఎస్ ప్లాట్ ఫామ్, సామ్​సంగ్ టైజెన్​లు ఆండ్రాయిడ్, ఐఫోన్లతోనూ పనిచేస్తాయి. గూగుల్ వియర్ ఓఎస్​తో ఉన్న వాచ్​లు ఐఫోన్లతో పనిచేసినప్పటికీ పరిమిత ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఫిట్​నెస్, ఆరోగ్య సంబంధిత ఫీచర్లు

ఆరోగ్యం, ఫిట్​నెస్ సంబంధిత వివరాలను సేకరించటం అనేది స్మార్ట్ వాచ్ చేసే ముఖ్యమైన పని. వీటికి సంబంధించి ఎక్కువ ఫీచర్లు ఉన్న వాచ్​లు కొనుగోలు చేయటం ఉత్తమం. స్మార్ట్ వాచ్ ఎంపికలో దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. హృదయ స్పందన గమనించే ఫీచర్ తప్పకుండా ఉండాలి. ఇక సైక్లింగ్, హైకింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటివాటిని ట్రాక్ చేసేందుకు జీపీఎస్​తో పాటు.. నిద్ర నాణ్యతను గమనించే ఫీచర్​ను పరిగణనలోకి తీసుకోవచ్చు. కొన్ని వాచ్​లు అయితే మహిళల ఆరోగ్యం, ఫిట్ నెస్​ సంబంధిత ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.

డిస్ ప్లే

ప్రస్తుతం ఎక్కువగా స్మార్ట్ వాచ్​లు ఎల్​సీడీ, ఆమోలెడ్​ డిస్​ప్లే తో వస్తున్నాయి. కలర్ డిస్​ప్లే బ్రైట్ నెస్ ఎక్కువగా ఉండటంతో తక్కువ సేపు బ్యాటరీ వచ్చే అవకాశం ఉంది. అయితే కంపెనీలు రోజు రోజుకు స్మార్ట్ వాచ్​ల సామర్థ్యం పెంచుతున్నాయి. ఒకసారి ఛార్జింగ్​తో కొన్ని రోజుల పాటు స్మార్ట్ వాచ్​ను ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. అయితే బ్లాక్ అండ్ వైట్ డిస్​ప్లే లో ఒక్క ఛార్జ్​తో ఎక్కువ సేపు ఉపయోగించుకునే వీలుంది.

యాప్ సెలక్షన్

స్మార్ట్ వాచ్ పరిమాణం పరంగా చిన్నగా ఉన్నప్పటికీ వందల సంఖ్యలో యాప్​లు దీనితో యాక్సెస్​ కాగలవు. స్పోర్ట్స్, ఉబర్, వాట్సాప్ వంటి యాప్​లు వీటికి కస్టమైజ్ అయి ఉంటున్నాయి. యాపిల్ వాచ్​కు అయితే చాలా యాప్​లున్నాయి. తరచూ ఉపయోగించే యాప్​లను వాచ్ తప్పకుండా సపోర్ట్ చేసేలా చూసుకోవాలి.

బ్యాటరీ

ఫిట్​నెస్ బ్యాండ్​లతో పోల్చితే స్మార్ట్ వాచ్ బ్యాటరీలు ఎక్కువ సేపు ఆగవు. అందుకే కొనుగోలు చేసేముందు బ్యాటరీ సామర్థ్యం తప్పకుండా తెలుసుకోవాలి. బ్యాటరీ లైఫ్​ను దృష్టిలో పెట్టుకొని వాచ్​ను ఎంపిక చేసుకోవాలి. కొన్ని వాచ్​లు ఒక్క ఛార్జ్​తో ఎక్కువ సేపు పనిచేస్తాయి.

ధర

తక్కువ బడ్జెట్​లో ఏ వాచ్ అత్యధిక ఫీచర్లను అందిస్తుందన్నది కొంత పరిశోధన చేసి తీసుకోవాలి. బడ్జెట్ సెగ్మెంట్​లో అయితే రియల్ మీ, మధ్యస్థ ధరల స్థాయిలో ఫాజిల్, ఫిట్ బిట్​.. ప్రీమియం విభాగంలో యాపిల్ వాచ్ సిరీస్ 5, శామ్​సంగ్ గెలాక్సీ వాచ్​లు ఉన్నాయి.

ఇదీ చదవండి: రివ్యూ 2020: ఉత్తమ స్మార్ట్​ఫోన్ బ్రాండ్లు ఇవే

బడ్జెట్ ధరల్లో ఉన్న స్మార్ట్ వాచ్​లు

హానర్ వాచ్ ఈఎస్..

  • బ్లడ్ ఆక్సిజన్ లెవల్ సెన్సార్ , హార్ట్ రేట్ మానిటర్, ఎస్పీఓ 2(ఆక్సిజన్ సాచురేషన్​) సెన్సార్
  • నిద్ర, ఒత్తిడి(స్ట్రెస్​) ట్రాకింగ్
  • దీర్ఘచతురస్రాకార డిస్ ప్లే
  • వర్కవుట్ సంబంధించి అనేక మోడ్స్, ఆటోమెటిక్​గా వర్కవుట్స్​ను గుర్తించే ఫీచర్
  • 30 నిమిషాల్లో 70 శాతం ఛార్జింగ్
  • ధర: రూ.4999

అమేజ్ ఫిట్ బిప్ యూ ప్రో

  • 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్రాస్-3 తో కూడిన కలర్ డిస్ ప్లే
  • 5 ఏటీఎమ్ వాటర్ రెసిస్టెంట్
  • బ్యాటరీ లైఫ్: 9 రోజులు
  • వాటర్ రెసిస్టెంట్: 50 మీటర్లు
  • 60కి పైగా స్పోర్ట్స్ మోడ్స్
  • అమెజాన్ అలెక్సా వాయిస్ కమాండ్స్
  • 24 గంటలూ హృదయ స్పందన మానిటరింగ్ సెన్సార్,
  • ఎస్పీఓ2 మానిటర్, నిద్ర నాణ్యత విశ్లేషణ
  • మహిళలకు సంబంధించి నెలసరి ట్రాకర్​
  • ధర రూ.4999

ఇదీ చదవండి: ఎంఐ నుంచి 108 మెగా పిక్సెళ్ల బడ్జెట్ స్మార్ట్​ఫోన్

రియల్ మీ వాచ్ ఎస్

  • 1.3ఇంచ్​, 600 నిట్స్ బ్రైట్ నెస్, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్-3 వృత్తాకార డిస్ ప్లే,
  • క్రికెట్, ఇండోర్​ రన్నింగ్, అవుట్ డోర్ సైక్లింగ్, ఫుట్ బాల్, యోగా తదితర 16 స్పోర్ట్స్ మోడ్స్
  • రియల్ టైమ్ హృదయ స్పందన మానిటరింగ్ కోసం పీపీజీ సెన్సార్,
  • రక్తంలో ఆక్సిజన్ స్థాయిల మానిటరింగ్ కోసం ఎస్​పీఓ 2 సెన్సార్,
  • నిద్ర మానిటరింగ్ ఫీచర్​
  • 390 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఒక్క ఛార్జ్​తో 15 రోజుల వరకు బ్యాటరీ
  • ధర రూ.4999

ఇదీ చదవండి: కరోనాతో స్మార్ట్​ఫోన్ల విక్రయాలు 48 శాతం డౌన్!

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3

  • 1.55 ఇంచుల ఎల్సీడీ డిస్ ప్లే
  • 14 స్పోర్ట్స్ మోడ్స్
  • క్యాలరీలు, ప్రయాణించిన దూరం ట్రాకింగ్, స్లిప్ మానిటర్,
  • నెలసరీ సైకిల్ మానిటర్ ఫీచర్​
  • కాల్స్, సందేశాలు, యాప్, సోషల్ మీడియా నోటిఫికేషన్లకు వైబ్రేషన్ అలర్ట్
  • బ్యాటరీ- 210 ఎంఏహెచ్, ఒక్క పూర్తి ఛార్జింగ్​తో 10 రోజలు వరకు నడిచే అవకాశం
  • ధర రూ. 4499

బోట్ స్టార్మ్

  • చతురస్రాకారపు 1.3 ఇంచుల డిస్ ప్లే
  • మెటల్ కేసింగ్, 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టెంట్​​
  • ఎస్పీఓ2 మానిటర్, 24/7 హృదయ స్పందన మానిటరింగ్,
  • నిద్ర నాణ్యత, నెలసరి ట్రాకింగ్
  • 9 స్పోర్ట్స్ మోడ్స్
  • 8 రోజుల వరకు బ్యాటరీ
  • ధర రూ.2499

ఇవీ చదవండి: 'జీవితాలు, జీవనోపాధి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు'

'ఆటో' రంగంపై కరోనా సెగ- విక్రయాలు తగ్గేనా?

ఈ-బైక్​ కొనాలనుకుంటున్నారా.. ఇవి మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.