ETV Bharat / business

కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారా?.. అయితే ఈ తప్పులు చేయకండి!

ఆర్థిక లక్ష్యాలు అందరికీ ఉంటాయి. కొంత మొత్తంలో జమ చేసి ఏదైనా కొందామనే చిన్న చిన్న లక్ష్యాల నుంచి భవిష్యత్​ అవసరాల కోసం దాయాలనుకుంటారు చాలామంది. అలాంటి లక్ష్యాల సాధనలో ఎక్కువగా చేసే పొరపాట్లు, వాటిని అధిగమించడం ఎలానో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

BECOME BILLIONAIRE
బిలీనియర్​ కావడానికి టిప్స్​
author img

By

Published : Sep 11, 2021, 1:28 PM IST

బాగా డబ్బు సంపాదించి కోటీశ్వరులు కావాలని చాలా మంది అనుకుంటారు. అందులో కొంత మంది మాత్రమే అనుకున్నట్లు కోటీశ్వరులుగా మారతారు. కోరికకు తగ్గుట్లుగా ఆచరణ ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సమయం, అవకాశం రెండూ చేజారితే తిరిగి పొందడం అసాధ్యం అనేది ఎంత సత్యమో... పొదుపు, మదుపులూ అంతే. సరైన ఆచరణ లేకపోతే ఆర్థిక లక్ష్యాలను చేరడం కష్టం. లక్ష్య సాధనలో పొరపాట్లు దొర్లితే తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

ప్రస్తుతం చాలా మందిని సంపాదన విషయం అడిగితే.. లక్షల్లో జీతాలు అందుకుంటున్నట్లు చెబుతారు. కానీ నెలాఖరు ఖర్చులు సరిపోక మళ్లీ అప్పుల వేటలో పడతారు. ఇక అనుకోని కారణాలతో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. అయితే ఆర్థిక ప్రణాళికను అమలు చేసేటప్పుడు దొర్లే సాధారణ పొరపాట్లు ఏంటి? వాటిని అధిగమించడం ఎలానో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఖర్చులు అదుపులో లేకపోవడం...

ఎంత సంపాదించినా అంతా ఖర్చవుతుందని చాలా మంది భావిస్తుంటారు. కొన్నిఅధ్యనాల ప్రకారం దేశంలో సంపాదించే వారిలో 52 శాతం మంది వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లు ఖర్చు చేస్తుంటారని తేలింది. వీరిలో కొంత మంది ఆదాయంతో పాటు అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని అధికంగా ఖర్చులు చేస్తున్నారు. ఈ కారణంగా అనుకున్న ఆర్థిక లక్ష్యాలను ఎప్పటికీ చేరలేకపోతున్నారు.

ఇలా జరగకుండా.. ఎక్కువ ఖర్చులు చేస్తున్నాం అని భావించినప్పుడు వాటిపై నిఘా వేయండి. ఎక్కడ వృథా ఖర్చులు అవుతున్నాయో గుర్తించండి. అవసరమైన మేరకే ఖర్చులు చేయడం.. ఖర్చు చేసే ప్రతి రూపాయిని లెక్కేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి కనీస ప్రణాళిక పాటిస్తే ఖర్చులు అదుపులో ఉండి.. మిగులు కనిపిస్తుంది.

పొదుపు తప్పదు...

ఆర్థిక లక్ష్యాలను చేరాలనుకుంటే మొదటగా చేయాల్సింది పొదుపు. పెరిగిన నిత్యవసరాలు, ఇతరత్రా ఖర్చులు, రుణాలపై వడ్డీలు సంపదను ఆవిరి చేస్తున్నాయని చాలా మంది చెప్తుంటారు. ఇలాంటి సమయాల్లో పెట్టుబడులపై ఆలోచన ఎలా అని కూడా భావిస్తుంటారు. అయితే.. పొదుపు అనేది ఖర్చు పెట్టాక మిగిలింది కాదు.. ప్రతి నెల లక్ష్యంగా పెట్టుకుని కొంత మొత్తాన్ని దాయడమే 'పొదుపు' అనేది గుర్తుంచుకోవాలి. ప్రతి నెలా తప్పని సరి ఖర్చులు ఎలానో అదే విధంగా పొదుపునూ తప్పని సరి జాబితాలో చేర్చుకోవాలి.

ప్రస్తుతం పొదుపు చేసిన మొత్తం విలువ ఐదేళ్ల తర్వాత ఎంతుంటుందో కచ్చితంగా చెప్పలేం. అందుకే వీలైనంత ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది. వేతన జీవులు.. వారి ఆదాయంలో కనీసం 10 శాతం నుంచి 20 శాతం వరకు పొదుపు చేయాలని అర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

అప్పు చేసి తిప్పలు వద్దు..

చాలా మందికి ఏదైనా కొనాలన్నా.. ఏ పనైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు మొదట గుర్తొచ్చేది అప్పే. అయితే అప్పుల్లో కొన్ని మేలు చేసేవి ఉంటాయి. మరి కొన్ని ఇబ్బందులు తెచ్చేవి ఉంటాయి. విద్యా రుణం, గృహరుణం వంటివి మేలు చేసే అప్పుల జాబితాలోకి వస్తాయి. అదే వ్యక్తిగత రుణం తీసుకుని ఇతర అవసరాలకు వాడుకోవడం, క్రెడిట్​ కార్డు ఉందని అనవసర ఖర్చులు చేయడం వంటివి ఇబ్బందులకు గురిచేసే అప్పులు. ఇవి మన ఆర్థిక స్థితిని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. వీటివల్ల సంపాదనలో ఎక్కువ భాగం అప్పులకు వడ్డీగా పోతుంది.

ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందు అనవసర అప్పులు చేయకూడదని దృఢంగా నిశ్చయించుకోవాలి. అప్పటి వరకు అధిక వడ్డీ చెల్లిస్తున్న రుణాలను త్వరగా తిరిగి చెల్లించాలని ప్రతినబూనాలి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని కోరికలను అదుపు చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ దాటితేనే ఆర్థిక లక్ష్యం సిద్ధిస్తుందని గుర్తుపెట్టుకోవాలి.

సరైన ప్రణాళిక లేకపోవడం..

సరైన ప్రణాళిక లేకుండా ఏదైనా పని చేస్తే.. అందులో విజయం సాధించడం కష్టం. ఆర్థిక లక్ష్యాల్లో ఇది మరీ ముఖ్యం. పొదుపు, ఖర్చులు అన్నీ సరైన ప్రణాళికతో నిర్వహించినప్పుడే ప్రతిఫలం దక్కుతుంది.

అత్యవసర నిధి లాంటివి ఇందులోకే వస్తాయి. పొదుపుల్లో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోకపోవడం కారణంగా.. ఏదైనా అత్యవసర పరిస్థితికి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు పొదుపు అదుపు తప్పుతుంది. ఇందుకోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ప్రతినెల అందులోనూ కొంత మొత్తంలో పొదుపు చేస్తూ ఉండాలి.

ఉన్న సొమ్మంతా ఒకే దగ్గర మదుపు చేయడం అనేది మంచి ఆర్థిక సూత్రం కాదు. పెట్టుబడి పెట్టదలచిన మొత్తాన్ని వివిధ మదుపు మార్గాల్లో (బంగారం, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా, బాండ్లు) పెట్టుబడిగా పెట్టాలి. దీని ద్వారా లాభ నష్టాలను సమతుల్యం చేసుకోవచ్చు.

నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రణాళికను అమలు చేసినప్పుడే విజయం సాధించగలుగుతాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇదీ చూడండి: లోన్​ ఇస్తామంటూ ఫోన్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.