యుటిలిటీ వాహనాలకు దేశీయంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. ఆటోమొబైల్ కంపెనీలు ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై పట్టు సాధించేందుకు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది కొత్త కొత్త మోడళ్లను ఈ సెగ్మెంట్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ రేసులో హ్యుందాయ్, మహీంద్రా&మహీంద్రా ముందు వరుసలో ఉన్నాయి.
హ్యుందాయ్ అల్కాజర్
అల్కాజర్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. 6,7 సీటర్ అల్కాజర్‌ను ఈ నెలాఖరున మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. సరికొత్త ప్రీమియం అల్కాజర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లో అందుబాటులోకి రానుంది.
హ్యుందాయ్ అల్కాజర్ ఫీచర్లు..
- అల్కాజర్ పేరుతో ఈ సరికొత్త కారు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) విభాగంలో క్రేటా వెర్షన్‌లో మూడు వరుసల సీట్లతో లభిస్తోంది.
- భిన్నమైన గ్రిల్‌తో, అదనపు పొడవుతో(2,760 ఎంఎం వీల్‌బేస్), క్రేటాకు రీడిజైన్ చేస్తున్నారు.
- ఇది రెండు ఇంజన్లతో వస్తుంది.159 పిఎస్ 2.0-లీటర్ పెట్రోల్, 15 పిఎస్ డీజిల్, రెండు ఇంజన్లకు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను అందించారు.
- ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అందిస్తున్నారు.
- అల్కాజర్ 6,7 సీట్ల లేఅవుట్‌తో.. మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉండడం వల్ల ప్రయాణం చేసే వారికి సౌకర్యవంతంగా ఉండనుంది.
- మే నెల ప్రారంభంలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు హ్యూందాయ్ తెలిపింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.13 లక్షల నుంచి రూ.20 వరకు ఉంటుందని అంచనా.
ఎం&ఎం ఎక్స్‌యూవీ 700..
మహీంద్రా & మహీంద్రా ఎస్‌యూవీ సెగ్మెంట్ అయిన ఎక్స్‌యూవీ పోర్ట్‌పోలియోలో మరో కొత్త మోడల్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 500కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా.. ఎక్స్‌యూవీ 700 కారును.. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో విడుదల చేయనుంది.
భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ ఎక్స్‌యూవీ 700ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
న్యూ మహీంద్రా స్కార్పియో..
ఎక్స్‌యూవీ 700తో పాటు మహీంద్రా కూడా న్యూ మహీంత్ర స్కార్పియో పేరుతో ఎస్‌యూవీని తీసుకురానుంది. గతంలో తీసుకువచ్చిన మోడళ్ల కంటే అడ్వాన్స్డ్ ఫీచర్లను ఇందులో జోడించింది.
విశాలమైన టచ్‌స్క్రీన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం టీఎఫ్‌టీ స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లాంటి కొత్త ఫీచర్లతో న్యూమహీంద్ర స్కార్పియో రానుంది. అయితే ఇంజన్ విషయంలో పాత మోడళ్లనే అనుకరించనున్నట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీని ఏడాది చివరి నాటికి భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.
బీఎస్6 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్..
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు బీఎస్ 6 డీ-మాక్స్ వీ-క్రాస్‌ను జూన్‌లో విడుదల చేయనుంది. అయితే ఇప్పటివరకూ ఈ కంపెనీకి సంబంధించి ఒక్క బీఎస్6 వాహనం కూడా మార్కెట్లోకి రాలేదు.
ప్రత్యేకతలు
- కీలెస్ ఎంట్రీ
- ఆటోమేటిక్ ఎయిర్ కండీషన్
- టచ్‌స్క్రీన్ సిస్టమ్
- రూఫ్-మౌంటెడ్ స్పీకర్లు
- సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఏ..
జర్మన్ ఆటోమోబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ తన సరికొత్త మోడల్‌ను ఈ ఏడాదే తీసుకురానుంది. ఇందుకు సంబంధించి 2020 ఆటో ఎక్స్‌పోలో సంస్థ దీన్ని ప్రదర్శించింది. గతంలో వచ్చిన మోడళ్ల కంటే విశాలంగా ఉండడం దీని ప్రత్యేకత.
ప్రత్యేకతలు..
- 10.25-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే
- 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- పనోరమిక్ సన్‌రూఫ్
- డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్
- సరికొత్త ఎంబియుఎక్స్ భద్రతా సిస్టమ్
- 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్
ప్రస్తుతం మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఏ బుకింగ్‌కు అవకాశం కల్పించింది మెర్సిడెజ్.
ఇదీ చూడండి: సరికొత్త ఫీచర్లతో హ్యుందాయ్ - ఎస్‌యూవీ అల్కాజర్