కేంద్రం తీసుకొచ్చిన నూతన పన్ను శ్లాబుల విధానం సామాన్యునికి ఆర్థికంగా భారమే కానీ.. లాభదాయకం ఏమాత్రం కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పన్ను శ్లాబులు పైకి లాభదాయకంగా కనబడుతున్నా.. లెక్కలు వేస్తే మాత్రం పెద్దగా ప్రయోజనం లేదని ఆర్థిక నిపుణులు తుమ్మ బాలరాజు చెబుతున్నారు. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకోవాలన్నా నిర్ణయం పూర్తిగా పన్ను చెల్లింపుదారుడిదే అయినప్పటికీ.. పాత పద్ధతిలోనే కొనసాగడం లాభదాయకమని సూచిస్తున్నారు.
శనివారం పార్లమెంటులో 2020 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ ఇకపై పన్ను చెల్లింపునకు రెండు విధానాలను ప్రతిపాదించారు. పాత విధానమా? కొత్త విధానమా? అనే దానిని పన్ను చెల్లింపుదారులే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.
అయితే ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. కొత్త విధానంలోకి మారితే ఎలాంటి మినహాయింపులు ఉండవు. పాత పద్దతిలో అయితే మినహాయింపులు కొనసాగుతాయి.