ETV Bharat / business

ఈ కుబేరుల కెరీర్​ ఎలా మొదలైందో తెలుసా?

author img

By

Published : Jul 12, 2021, 3:11 PM IST

Updated : Jul 12, 2021, 3:26 PM IST

ఎలాన్​ మస్క్​ వంటి బిలియనీర్​.. ఒకప్పుడు వీడియో గేమ్​లను అమ్ముతూ తిరిగాడంటే నమ్మగలరా? అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​.. ఓ బర్గర్​ కంపెనీలో పని చేశాడంటే ఒప్పుకోగలరా? వీరే కాదు.. బిలియనీర్లుగా ఇప్పుడు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న మరెందరో.. ఒకప్పుడు చిన్నాచితకా ఉద్యోగం చేసినవారే. మనలాగే డబ్బులను పొదుపుగా ఖర్చు చేసినవారే. బిలియనీర్లుగా మారే క్రమంలో వారంతా తమ కెరీర్​ను​ ఎలా ప్రారంభించారంటే..?

first job of billionaires
బిలియనీర్ల మొదటి ఉద్యోగం

'ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాని సృష్టించాలి. కోట్లానుకోట్లు సంపాదించాలి. ప్రపంచవ్యాప్తంగా మన పేరు మారుమోగాలి' ఇలాంటి కోరికలు మనలో చాలా మందికి ఉండే ఉంటాయి. కానీ, వాటిని నిజం చేసుకోవడం మాత్రం అందరి వల్ల కాదు! అది.. ఎలాన్​ మస్క్​, జెఫ్​ బెజోస్​, వారెన్​ బఫెట్​, మార్క్​ జుకర్​బర్గ్​, స్టీవ్​జాబ్స్​, బిల్​గేట్స్​, రతన్​ టాటా వంటి వారికి మాత్రమే సాధ్యం.

అయితే.. 'వారికే ఎందుకు సాధ్యమైంది? మన వల్ల ఎందుకు కాదు' అని ఆలోచిస్తే.. 'వాళ్లదేముంది బార్న్​ విత్​ సిల్వర్​​ స్ఫూన్​ అంటారు. అడిగితే కొండ మీద కోతినైనా తెచ్చిచ్చే కుటుంబం ఉండి ఉంటుంది.' అని అనుకుంటాం. కానీ, అది ఏ మాత్రం నిజం కాదు! ఈ బిలియనీర్లు కూడా ఒకప్పుడు మనలా చిరుద్యోగాలు చేస్తూ.. డబ్బులను పొదుపు చేస్తూ ఖర్చు చేసినవారే! అయితే అనుకున్నది సాధించడంపై తమకు ఉన్న అంకితభావం, చిన్న వయసులో తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా వీరు ఉన్నత స్థానానికి చేరుకోగలిగారు. బిలియనీర్లుగా మారారు. ఇంతకీ వీరంతా తమ ఉద్యోగ జీవితాన్ని ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం..

ఎలాన్​ మస్క్​: ప్రముఖ విద్యుత్​ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' అధిపతిగా.. స్పేస్​ ఎక్స్​ సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్​.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్​. ఆయనే కాదు.. ఆయన చేసే ఓ చిన్న ట్వీట్​ కూడా వేలాది కోట్లు సంపదను నియంత్రించగలదు. అంతటి వ్యక్తి ఒకప్పుడు కంప్యూటర్​ గేమ్​లను అమ్మేవాడంటే నమ్మగలరా? కానీ అదే నిజం. 1983లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా తన కెరీర్​ను ప్రారంభించిన మస్క్​.. ఇంటింటికి తిరిగి కంప్యూటర్​ గేమ్​లను విక్రయించేవారు. దాని ద్వారా ఆయన నెలకు 500 డాలర్లు, అంటే రూ.37,405ను జీతంగా పొందేవారు. దక్షిణాఫ్రికాలో పెరిగిన ఆయన.. తన 17 ఏళ్ల వయసులో కెనడాకు వలస వచ్చారు. అప్పుడే సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేశారు.

elan musk
ఎలాన్​ మస్క్​

జెఫ్​ బెజోస్​: ప్రముఖ ఇ-కామర్స్​ సంస్థ అమెజాన్​ అధిపతి, ప్రపంచంలోనే రెండో కుబేరుడైన జెఫ్​ బెజోస్​.. తన కెరీర్​ను మెక్​డొనాల్డ్స్​ సంస్థలో బర్గర్లు అమ్మే పనితో ప్రారంభించారు. 16 ఏళ్ల వయసులో ఆ సంస్థలో పని చేసిన ఆయన.. గంటకు రూ.201ని జీతంగా పొందేవారు.

jeff bezos
జెఫ్​ బెజోస్​

వారెన్ బఫెట్​: ఈ అమెరికా వ్యాపార దిగ్గజం.. ఒకప్పుడు 'పేపర్​ బాయ్​గా పని చేశారం'టే.. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. అదే నిజం. 1994లో ఆయన 'వాషింగ్టన్ పోస్ట్' పత్రికను ఇంటింటికి తిరుగుతూ విక్రయించేవారు. ఈ పని చేయడం వల్ల ఆయనకు నెలకు 175 డాలర్లు(రూ.13,091) జీతంగా వచ్చేది.

warren buffet
వారెన్​ బఫెట్​

మార్క్​ జుకర్​బర్గ్​​: సామాజిక మాధ్యమ దిగ్గజం.. ఫేస్​బుక్​ సీఈఓగా మార్క్ జుకర్​ బర్గ్​ మనందరికీ తెలుసు. అయితే.. ఆయన తొలి ఉద్యోగం గురించి తెలిన వాళ్లు మాత్రం చాలా అరుదు. 18 ఏళ్ల వయసులో సైనాప్స్​ అనే మ్యూజిక్​ సంస్థలో ఆయన ఉద్యోగిగా తన కెరీర్​ను ప్రారంభించారు. అనంతరం.. ఆయన ఫేస్​బుక్​ను రూపొందించి మంచి పేరు సంపాదించారు.

mark zuckerberg
మార్క్ జుకర్​ బర్గ్​

స్టీవ్​ జాబ్స్​: ఖరీదైన ఫోన్లు అంటే గుర్తొచ్చేది ఐఫోన్​. ఐఫోన్​ తయారు చేసే యాపిల్​ సంస్థ వ్యవస్థాపకుడిగా, ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా స్టీవ్​ జాబ్స్​ పేరు అంతటా సుపరిచితమే. అయితే.. ఆయన ఒకప్పుడు.. వీడియో గేమ్స్​ తయారు చేసే 'అటారీ' అనే సంస్థలో పని చేస్తూ తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

steve jobs
స్టీవ్​ జాబ్స్​

బిల్​ గేట్స్​: 15 ఏళ్ల వయసులో టీఆర్​డబ్ల్యూ సంస్థలో.. కంప్యూటర్​ ప్రొగ్రామర్​గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు మైక్రోసాఫ్ట్​ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​.

bill gates
బిల్​ గేట్స్​

రతన్ టాటా: ప్రముఖ పారిశ్రామిక వేత్త, మ్యాన్​ విత్​ గోల్డెన్ హార్ట్​గా పేరు సంపాదించిన రతన్​ టాటా.. 1961లో టాటా స్టీల్​ కంపెనీలో తన మొదటి ఉద్యోగం చేశారు. అక్కడ ఆయన గనుల్లో పేలుడు పదార్థాల పనిని నిర్వహించేవారు.

ratan tata
రతన్ టాటా

ఇదీ చూడండి: Flipkart: 2.8 లక్షల కోట్లకు ఫ్లిప్​కార్ట్ విలువ!

ఇదీ చూడండి: బడ్జెట్ బైక్​లు కావాలా?- రూ.లక్ష లోపు బెస్ట్ ఇవే!

Last Updated : Jul 12, 2021, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.