భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తొలిసారిగా స్పందించారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్నది విచారకరం. మంచిది కాదు. భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్ వలసదారుడు ఇన్ఫోసిస్ తదుపరి సీఈవో అయితే చూడాలనుంది’’ అని పేర్కొన్నారు.
అమెరికన్ జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే... సీఏఏను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? లేక దాని చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి ఇలా స్పందించారా అన్న సందిగ్ధత తొలుత నెలకొంది. నిజానికి ఆయన చట్టబద్ధమైన వలస విధానం గురించే వ్యాఖ్యానించారని, దీని వల్ల ప్రతిభావంతులు సమాజ అభ్యున్నతికి అనేక విధాలా సాయపడగలరన్నది ఆయన ఉద్దేశమని తెలుస్తోంది.
ఇదీ చూడండి : 40వేల కిమీ.. 1500 అమర జవాన్ల కుటుంబాలు.. ఓ బాలుడు