ETV Bharat / business

నషాళానికెక్కిన ఉల్లిఘాటు.. చుక్కలనంటుతున్న ధర - ఉల్లి పంట

దేశంలో ఉల్లి.. సామాన్యుడి కన్నీరుగా మారింది. సగటు వినియోగదారుడు ఉల్లిని కొనలేని పరిస్థితి నెలకొంది. నిత్యం ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఏటా పంట చేతికొచ్చే సమయంలో ఉల్లి ధరలు పెరగడం సాధారణమైనప్పటికీ ఈ సారి రెండు నెలల ముందే ధరలు నింగికెగిసాయి. ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పకతప్పదు. విదేశాల నుంచి ఉల్లి దిగుమతికి కేంద్రం పలు దేశాలను సంప్రదించింది. ధరల నియంత్రణకై చర్యలను ముమ్మరం చేసింది. హడావుడిగా తాత్కాలిక చర్యలు చేపట్టడం కంటే సమస్యను ముందుగానే గుర్తించి శాశ్వత నివారణ చర్యలు చేపడితేనే రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం ఉంటుంది.

The average consumer is unable to afford the onion
నషాళానికెక్కిన ఉల్లిఘాటు.. చుక్కలనంటుతున్న ధర
author img

By

Published : Dec 14, 2019, 6:40 AM IST

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వినియోగదారులను వెతలకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలకు చికాకు కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఈ పంట అధికంగా పండుతుంది. కర్నూలు ఉల్లి కన్నా మహారాష్ట్ర ఉల్లి నాణ్యమైనది. కర్నూలు పంట ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మహారాష్ట్రలో పండింది నాలుగైదు నెలల వరకు నిల్వ ఉంటుంది. అందుకే మహారాష్ట్ర పంటకు మంచి ధర లభిస్తుంది.

పంట దిగుబడి తగ్గడమే కారణం...

ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు ఎక్కువగా కర్నూలుజిల్లా నుంచే ఉల్లి సరఫరా అవుతుంది. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పంట దెబ్బతింది. ఫలితంగా నిరుటితో పోలిస్తే దిగుబడి బాగా తగ్గింది. కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం విపణికి నిరుడు 55,330 మెట్రిక్‌ టన్నుల పంట రాగా, ఈ ఏడాది నవంబరు వరకు 28,566 మెట్రిక్‌ టన్నులే వచ్చింది. ఏదైనా వస్తువు సరఫరా తగ్గితే, దాని ధర పెరగడం సహజం.

ప్రస్తుతం ఉల్లి విషయంలో దేశవ్యాప్తంగా జరిగింది ఇదే. 1980, 1998, 2010లలో ఉత్పత్తి తగ్గి, ధరలు విపరీతంగా పెరిగాయి. ఉల్లికి ప్రత్యామ్నాయం వేరొకటి లేదు. దీని ధర పెరిగినా గిరాకీ పెద్దగా తగ్గదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎంతో కొంత కొనాల్సిందే. పూర్తిగా మానేసే పరిస్థితి ఉండదు. దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు ధర పెంచేస్తున్నారు.

ముందుచూపు లేనందునే...

ఏటా పంట చేతికందే ఒకటి రెండు నెలల ముందు ధరలు పెరగడం సహజం. ఈ ఏడాది ధరల పెరుగుదల మూడు నాలుగు నెలలు ముందుగానే ప్రారంభమైంది. ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పకతప్పదు. దేశంలో ఉల్లి దిగుమతి చేసుకోవడానికి ప్రైవేటు వ్యాపారులకు అనుమతి లేదు. కేంద్రమే విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటుంది. ఈ పని ముందుగా చేయకుండా ప్రతిసారి సమస్య తలెత్తినప్పుడు హడావుడిగా స్పందించడం ఆనవాయితీగా మారింది.

పంట చేతికి రానున్న దశలో దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బాధ్యతను అనుభవంలేని ‘మెటల్స్‌ అండ్‌ మినరల్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌(ఎమ్‌ఎమ్‌టీసీ)’కి అప్పగించింది. వాస్తవానికి ఉల్లి దిగుమతి వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. దిగుమతి చేసుకునే ఉల్లి ఇక్కడికి వచ్చేసరికి దేశీయ పంట చేతికి వస్తుంది. దీంతో ధర పడిపోయి ఇక్కడి రైతులు నష్టాలపాలవుతారు.

ఉల్లి దిగుమతి సంక్లిష్ట ప్రక్రియ...

ఉల్లి కొరత ఏర్పడటం, ధరలు ఆకాశాన్నంటడంతో దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం ఈజిప్టు, టర్కీ తదితర దేశాలను సంప్రతించింది. ఎమ్‌ఎమ్‌టీసీ ప్రభుత్వ నిబంధనలను పాటించి, దిగుమతి చేసుకోవాలి. ఆ మేరకు అంతర్జాతీయ టెండర్లు పిలవాలి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి, దిగుమతి చేసుకునే ఉల్లి దేశంలోకి రావడానికి కనీసం అయిదారు వారాలైనా పడుతుంది. విదేశాల నుంచి ఓడరేవులకు, అక్కడి నుంచి వినియోగదారులకు చేరేసరికి సమయం పడుతుంది. ఓడరేవుల నుంచి వచ్చే ఉల్లిని వివిధ నగరాలకు తరలించి, అక్కడి గిడ్డంగుల్లో నిల్వచేయాలి. ఎమ్‌ఎమ్‌టీసీకి సొంత గిడ్డంగులు లేనందువల్ల అద్దె గిడ్డంగులను వెతుక్కోవాలి. ఆ తరవాత టోకు వ్యాపారులకు అమ్మడానికి నిబంధనల మేరకు టెండర్లు పిలవాలి. టోకు వ్యాపారులు చిలర్ల వ్యాపారులకు అమ్మాలి. వారు వినియోగదారులకు విక్రయించాలి.

నాణ్యతలో దేశీయ ఉల్లే మేలు...

దిగుమతి చేసుకునే ఉల్లితో ఇంకో సమస్య ఉంది. డిసెంబరు నెలాఖరుకు భారత్‌లోనూ పంట అందుబాటులోకి వస్తుంది. అప్పుడు దిగుమతి చేసుకున్న ఉల్లిని ఎవరూ కొనరు. విదేశీ ఉల్లికన్నా దేశీయ ఉల్లి నాణ్యతే బాగా ఉండటం ఇందుకు కారణం. విదేశీ ఉల్లి గడ్డలు తెల్లగా, పెద్దవిగా ఉంటాయి. దేశీయ ఉల్లిపాయలు చిన్నవిగా, ఘాటుగా ఉంటాయి. ప్రతి వంటలోనూ ఉల్లి వాడే అలవాటు ఉండటంవల్ల వినియోగదారులు దేశీయ ఉల్లి వైపే మొగ్గుచూపుతారు.

రైతుల కంట కన్నీరు...

ఉల్లిగడ్డల ఉత్పత్తిలో చైనా తరవాత భారత్‌ రెండోస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1.70 కోట్ల టన్నుల ఉల్లిగడ్డలు పండుతాయని అంచనా. దళారులు, అధికారులు కుమ్మక్కై అటు రైతులను, ఇటు వినియోగదారులను దోచేస్తున్నారు. భారత్‌లో టోకు వ్యాపారులు 500 క్వింటాళ్లు, చిల్లర వ్యాపారులు 100 క్వింటాళ్ల వరకే నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇతర దేశాల నుంచి అత్యవసరంగా దిగుమతులు చేసుకోవాలని నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వాలూ తమ వంతుగా రాయితీపై విక్రయించడం ప్రారంభించాయి. మరోపక్క రాష్ట్రాలు తాము వినియోగదారులకు ఇస్తున్న రాయితీలో కొంతభాగం కేంద్రం భరించాలని కోరుతున్నాయి. కొనే పరిస్థితి లేకుండా వినియోగదారులకు, దిగుబడులు తగ్గి రైతులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని రాష్ట్రాల్లో మంచి ధర పలకడంతో రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. వారి కళ్ళల్లో సంతోషం కనిపిస్తోంది.

చోరీలు... దోపిడీలు.. దౌర్జన్యాలు...

గిట్టుబాటు ధర లేని కారణంగా కర్నూలు విపణిలో గత ఏడాది ఒక ఉల్లి రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమ్‌ బంగలో ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. మధ్యప్రదేశ్‌లో దాదాపు ఆరు క్వింటాళ్ల పంటను అపహరించుకుపోయారు. ధరలు పెరగడంవల్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. గిట్టుబాటు ధర లభించకపోడంతో గతంలో పంటను నడిరోడ్డుపై పారేసిన ఉదంతాలెన్నో ఉన్నాయి. కేవలం ఉల్లి ధర పెరుగుదల కారణంగానే ప్రభుత్వాలు కుప్పకూలిన సందర్భాలు గతంలో ఉన్నాయి. పాలకులు ఇలాంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కొరత ఏర్పడినప్పుడు హడావుడిగా రంగంలోకి దిగి తాత్కాలిక చర్యలు చేపట్టినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. సమస్యను ముందుగానే గుర్తించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలి. వినియోగదారులకు సరసమైన, రైతులకు గిట్టుబాటు ధరలను అందించే లక్ష్యంతో పని చేయాలి. అప్పుడే ఉభయులకూ మేలు జరుగుతుంది!
- డా. కేతిరెడ్డి కరుణానిధి రచయిత- అంబేడ్కర్​ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వాణిజ్య విభాగ ఆచార్యులు)

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 13 December 2019
++VIDEO QUALITY AS INCOMING++
1. Various of US President Donald Trump and Paraguayan President Mario Abdo Benitez in Oval Office, Trump talks to reporters
2. SOUNDBITE (English) Craig Allen, US-China Business Council President:
"The tariffs scheduled to go into effect on Sunday are now canceled. And that's very significant. As much as 160 billion dollars worth of imports were to be tariffs."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Beijing – 13 December 2019
3. Wide of news conference
4. Wang Shouwen, Vice Minister of Commerce and Deputy Trade Representative of China speaking
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 13 December 2019
5. SOUNDBITE (English) Craig Allen, US-China Business Council President:
"The Chinese will be purchasing large amounts of American agricultural products. The Chinese press conference and the American statements are a little bit different. And therefore, it's not 100 percent clear what exactly the Chinese will be buying."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Norwood, North Carolina - 13 December 2019
6. Various of farm property
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 13 December 2019
7. SOUNDBITE (English) Craig Allen, US-China Business Council President:
"Tariffs are still in place for about two hundred and fifty billion dollars worth of goods. But Phase 1 is now concluded and they are apparently going to be fixed at where they currently are and will not be going up. Now, in the meantime, we will carry on negotiations. What the president said is immediately to hopefully resolve additional issues within the relationship to remove those existing tariffs."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Norwood, North Carolina - 13 December 2019
8. Wide of farm property
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 13 December 2019
9. SOUNDBITE (English) Craig Allen, US-China Business Council President:
"The first thing to note is that we do not have a piece of paper and therefore without a document to look at, we don't have the details. So, that's the first thing to be clear about. The figures --the projected exports in agriculture are also not clear. So, this could be larger or it could be smaller. It could be for a longer period of time or a shorter period of time. We don't know. The second thing where there has been progress is in the intellectual property rights area. And again, we do not have the details. And so it's difficult to make a judgment. However, the Chinese have been strengthening their intellectual property rights regime pretty significantly over the last 18 months. And so we have seen considerable progress and we look forward very much to what the details of the specific agreement will be as soon as that paper is released."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Beijing – 13 December 2019
10. Ning Jizhe, Vice Chairman of National Development and Reform Commission speaking
11. Wide of press conference
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington DC - 13 December 2019
12. SOUNDBITE (English) Craig Allen, US-China Business Council President:
"We had exported 21 billion dollars worth of agricultural products to China in 2017. That was down to about half that amount in 2019. So presumably we will be well north of 21, 22, 23 billion dollars in 2020. Very good news for the farmers. I think it's also good news for American intellectual property right holders, software, movies, music, patent holders as well. They should expect to be able to generate more revenue in China, and to bring that back to the United States."
13. President Donald Trump in Oval office
14. Cutaway of White House officials in Oval Office
15. SOUNDBITE (English) Craig Allen, US-China Business Council President:
"We don't have a document and we have heard quite different things from the White House and from the Chinese side. And so it will be very important to see how they reconcile their various announcements into a single document that that governs both sides."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Virginia Beach, VA - 25 May 2017
16. Wide Stihl factory
17. Assembly line
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 13 December 2019
18. Various of screens showing the Shanghai Composite Index and Shenzhen Component Index
STORYLINE:
US President Donald Trump said Friday that the US had cancelled plans to impose new tariffs on US$160 billion worth of Chinese imports on Sunday as part of a modest interim agreement that de-escalates a 17-month trade war between the world's two biggest economies.
The United States is also reducing existing import taxes on about $112 billion in Chinese goods from 15% to 7.5%.
In return, Trump said on Twitter, the Chinese had agreed to "massive'' purchases of American farm and manufactured products as part of a so-called Phase 1 deal.
The office of Trump's trade representative said China had consented to "structural reforms'' that would improve intellectual property protection and curb the practice of forcing foreign companies to hand over technology as the price of admission to the Chinese market.
But it offered no details, and business groups said more needed to be done to combat Beijing's aggressive trade practices.
Craig Allen, President of the US-China Business Council President, said "the tariffs scheduled to go into effect on Sunday are now canceled. And that's very significant".
But Allen added: "We don't have a document and we have heard quite different things from the White House and from the Chinese side and so it will be very important to see how they reconcile their various announcements into a single document that that governs both sides."
Chinese officials said at a briefing in Beijing on Friday that if Washington reduces the tariffs, China will lower its trade penalties on American goods and also scrap plans for new tariffs on Sunday.
Trump told reporters at the White House that Chinese farm purchases would hit US$50 billion.
The deal announced on Friday leaves unresolved some of the thorniest issues, but Trump said work on a follow-up would begin immediately, rather than waiting until after the 2020 election.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.