ETV Bharat / business

భారత్​లో 'టెస్లా' ప్లాంట్​ ఎక్కడో  తెలుసా? - టెస్లా గురించి తాజా సమాచారం

అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా భారత్​లో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. బెంగళూరులో మొదటి సిటీ సెంటర్​ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు లక్ష రూపాయిల మూలధనంతో రిజిస్ట్రార్ ఆఫ్​ కంపెనీస్​లో ప్రైవేటు సంస్థగా పేరుని నమోదు చేసుకుంది.

Tesla registers unit in India
భారత మార్కెట్లోకి విద్యుత్​ కార్ల దిగ్గజం 'టెస్లా'
author img

By

Published : Jan 13, 2021, 8:55 AM IST

అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా భారత్​లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు రిజిస్ట్రార్​ ఆఫ్​ కంపెనీస్​లో 'టెస్లా ఇండియా మోటార్స్​' పేరున రిజిస్టర్​ చేయించుకుంది. లక్ష రూపాయిల మూలధనంతో ఒక ప్రైవేటు కంపెనీగా పేరు నమోదు అయింది. అయితే దీని కార్యకలాపాలను బెంగళూరు వేదికగా సాగుతాయని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ట్వీట్​ చేశారు. మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి ప్రభుత్వ కోరినప్పటికీ ఈ సంస్థ బెంగళూరుకు తరలివెళ్లింది.

వైభవ్​ తనేజా, వెంకట్రంగమ్​, శ్రీరామ్​, డెవిడ్​ జాన్​ ఫెయిన్​స్టెయిన్ భారత్​లో నెలకొల్పే సంస్థకు బోర్డ్​ ఆఫ్​ డైరెక్టర్స్​గా వ్యవహరించనున్నట్లు రిజిస్ట్రార్​ ఆఫ్​ కంపెనీస్​కు అందజేసిన పత్రాల్లో పేర్కొంది.​ మొదట టాటా మోటార్స్​తో జత కట్టాలని ప్రయత్నించిన ఈ ఆటోమొబైల్​ దిగ్గజం.. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం కారణంగా ప్రయత్నాలను విరమించుకొంది.

అయితే టెస్లా రాకపై గతంలోనే కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ స్పందిచారు. కొత్త ఏడాదిలో ఈ సంస్థ తన కార్యకలాపాలను భారత్​ నుంచి కొనసాగిస్తుందని అన్నారు. ఇది వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్​ వాహనాల తయారీ కేంద్రం కానుందని తెలిపారు.

ఇదీ చూడండి: '2021లో భారత మార్కెట్లోకి టెస్లా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.