ETV Bharat / business

నెదర్లాండ్స్​ నుంచి భారత్​కు 'టెస్లా' కారు - tesla india bangalore via netherlands

తాను సంపాదించే దానిలో ప్రతి రూపాయి లెక్కే అంటున్నారు ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' అధినేత ఎలన్​ మస్క్​. ఇప్పటికే భారత్​లో కంపెనీ నెలకొల్పాలని నిర్ణయం తీసుకొన్న మస్క్​.. దానీ మాతృ సంస్థగా నెదర్లాండ్స్​లోని టెస్లా మోటార్స్​ను ఎంచుకున్నారు. నెదర్లాండ్స్​, భారత్​ మధ్య ఉన్న పన్ను రాయితీ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

tesla motors will route its india investment through dutch
నెదర్లాండ్స్​ నుంచి భారత్​కు రానున్న 'టెస్లా' కారు
author img

By

Published : Jan 18, 2021, 6:55 PM IST

ఎలన్ మస్క్‌లోని వ్యాపారి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాడు. ప్రతి రూపాయి లెక్క అన్నట్లు వ్యవహరిస్తాడు. అందుకే భారత్‌లో తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ఎటునుంచి వస్తే లాభమో లెక్కలేసుకొని.. నెదర్లాండ్స్‌ను ఎంచుకొన్నాడు. ఇటీవల భారత్‌లో మస్క్‌ రిజిస్టర్‌ చేసిన టెస్లా మోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ఇండియాకు నెదర్లాండ్స్‌లోని టెస్లా మోటార్స్‌ నెదర్లాండ్స్‌ మాతృసంస్థగా వ్యవహరించనుంది. ఈ నిర్ణయంతో మస్క్‌కు భారత్‌లో మూలధనంపై వచ్చే లాభాలు, డివిడెండ్‌ చెల్లింపుల్లో భారీగా పన్ను రాయితీలు లభించనున్నాయి.

టెస్లా నిర్ణయం విభిన్నమైందనే చెప్పాలి. గతంలో భారత్‌కు వచ్చిన విదేశీ కంపెనీలు తమ యాజమాన్యాలు ఉన్న చోటు నుంచే భారత్‌లోకి ప్రవేశించాయి. 2017లో భారత్‌లో పెట్టుబడి పెట్టిన ఎంజీ మోటార్స్‌ చైనా నుంచి వచ్చింది. ఈ సంస్థ వాస్తవంగా బ్రిటన్‌కు చెందినదైనా.. దీనిని చైనా సంస్థ ఎస్‌ఏఐసీ మోటార్స్‌ కొనుగోలు చేసింది. అలానే కియా మోటార్స్‌ పెట్టుబడులు నేరుగా దక్షిణ కొరియా నుంచి వచ్చాయి. ఆ దేశంలోనే కియా కార్పొరేట్‌ కార్యాలయం కూడా ఉంది.

నెదర్లాండ్స్‌ ఎందుకు..?

టెస్లా మోటార్స్‌ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో రిజిస్టరైంది. టెస్లామోటార్స్‌ నెదర్లాండ్స్‌ దీని అనుబంధ సంస్థ. కానీ, అమెరికా సంస్థలు నెదర్లాండ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతాయి. ఆ కంపెనీలకు పన్ను రాయితీలు ఎక్కువగా ఇవ్వడం, మేధోహక్కుల సంరక్షణకు కఠిన చట్టాలు ఉండటమే కారణం.

సింగపూర్‌, మారిషస్‌తో ఉన్న పన్ను ఒప్పందాలను భారత్‌ సవరించింది. గతంలో ఈ రెండు దేశాల నుంచి భారత్‌కు ఒకప్పుడు భారీగా ఎఫ్‌డీఐలు వచ్చేవి. కానీ, సవరణ తర్వాత ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్నురాయితీలు తగ్గిపోయాయి. దీంతో పన్ను రాయితీలు పొందాలంటే మిగిలిన అత్యున్నత మార్గాల్లో నెదర్లాండ్స్‌ కూడా ఒకటి. ఈ దేశంతో ఉన్న ఒప్పందం ప్రకారం ఆయా డచ్‌ కంపెనీలు భారతీయ విభాగాలను విదేశీ కంపెనీలకు విక్రయించినా మూలధన పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాదు.. డివిడెండ్‌ ట్యాక్స్‌, విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌లు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

జనవరి 8న బెంగళూరులో రిజిస్ట్రేషన్‌..

టెస్లామోటార్స్ భారత్‌లో ప్రవేశించింది. జనవరి 8వ తేదీన బెంగళూరులోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో టెస్లా మోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా రిజిస్టరైంది. ఈ కంపెనీ ఆధీకృత మూలధనం రూ.15లక్షలుగా.. పెయిడప్‌ క్యాపిటల్‌ రూ.లక్షగా పేర్కొన్నారు. దీంతోపాటు ఒక కార్యాలయం కూడా తెరిచింది. దీనికి వైభవ్‌ తనేజా, వెంకట్రంగం శ్రీరామ్‌, డేవిడ్‌ జాన్‌ ఫైన్‌స్టైన్‌లు డైరెక్టర్లుగా వ్యహరించనున్నారు. ఇప్పటికే తనేజా చీఫ్‌ అకౌంటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇక ఫైన్‌స్టైన్‌ గ్లోబల్‌ట్రేడ్‌ అండ్‌ న్యూమార్కెట్‌ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు టెస్లా ప్రయత్నాలు చేస్తోంది. టెస్లా రిజిస్ట్రేషన్‌ విషయమై కర్నాటక సీఎం బీఎస్‌ యడూయూరప్ప కూడా ట్వీట్‌ చేశారు. టెస్లా రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కర్ణాటక ఈమొబిలిటీ రంగానికి ఊపు..

కర్ణాటకలో టెస్లా అడుగుపెట్టడంతో అక్కడి విద్యుత్త కార్ల తయారీ రంగానికి అదనపు బలం లభించినట్లైంది. ఇప్పటికే అక్కడ మహీంద్రా ఎలక్ట్రిక్‌, అధర్‌ ఎనర్జీ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. మరోపక్క పలు రాష్ట్రాలు కూడా విద్యుత్తు వాహనాలకు అవసరమైన పాలసీలను చేస్తున్నాయి. వీటిల్లో దిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ వంటివి ఉన్నాయి.

ఇవీ చూడండి:

భారత్​లో 'టెస్లా' ప్లాంట్​ ఎక్కడో తెలుసా?

చెప్పినట్టే భారత్​ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాం: టెస్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.