ETV Bharat / business

కాగ్​ 'జీఎస్​టీ నివేదిక'పై కేంద్రం మండిపాటు - కాగ్​

2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు నష్టపరిహారంగా చెల్లించాల్సిన రూ. 47,272 కోట్ల జీఎస్​టీ మొత్తాన్ని కేంద్రం తప్పుగా అట్టిపెట్టుకుందని కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్(కాగ్​)​ ఇచ్చిన నివేదికపై కేంద్రం మండిపడింది. ఈ మేరకు జీఎస్​టీ పరిహారంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

Temporary retention of GST cess pending reconciliation not diversion: FinMin
కాగ్​ నివేదికపై కేంద్రం మండిపాటు
author img

By

Published : Sep 26, 2020, 6:59 PM IST

కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​ ఇచ్చిన నివేదికపై కేంద్రం మండిపడింది. జీఎస్​టీ నిధులను తాత్కాలికంగానే అట్టిపెట్టుకున్నామని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. దాని అర్థం దారి మళ్లింపు కాదని వివరణ ఇచ్చింది. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించినట్లు స్పష్టం చేసింది.

2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు నష్టపరిహారంగా చెల్లించాల్సిన రూ. 47 వేల 272 కోట్ల జీఎస్​టీ మొత్తాన్ని.. కేంద్రం తప్పుగా అట్టిపెట్టుకుందని కాగ్​ శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కాగ్​​ నివేదికను కేంద్రం తప్పుబట్టింది.

ఇదీ చూడండి: జీఎస్​టీ చట్టం ఉల్లంఘించిన కేంద్రం: కాగ్

2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి 62వేల 611 కోట్ల రూపాయల జీఎస్​టీ ఆదాయం వస్తే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పూర్తి నష్టపరిహార మొత్తంగా.. రూ. 41వేల 146 కోట్ల మొత్తాన్ని విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 95వేల 81వేల కోట్ల రూపాయల ఆదాయంలో.. రూ.69,275 కోట్లను నష్టపరిహారంగా అందించినట్లు తెలిపింది.

2019-20లో 95వేల 444 కోట్ల రూపాయల జీఎస్​టీ ఆదాయం వస్తే రాష్ట్రాలకు రూ. లక్షా 65వేల 302 కోట్లు నష్ట పరిహారంగా చెల్లించినట్లు స్పష్టం చేసింది. వినియోగం కాకుండా ఉన్న 47వేల 271 కోట్ల రూపాయలతో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసినట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.