ETV Bharat / business

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపుతో ఎవరికి లాభం? - ధరల పెంపుతో ఎవరికి లాభం

దేశంలో స్థిరంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్​ ధరలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 19 రోజుల్లో పెట్రోల్, డీజిల్​ పోటాపోటీగా రూ.8.7, రూ.10 మేర పెరిగాయి. ఈ స్థాయిలో ధరలు పెరగటానికి కారణమేంటి? ధరల పెంపుతో లాభపడేది ప్రభుత్వాలా.. ఆయిల్ కంపెనీలా? అసలు ఈ ధరలను ఎలా నిర్ణయిస్తారు?

petrol-diesel
పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపు
author img

By

Published : Jun 26, 2020, 5:55 AM IST

కొద్ది రోజులుగా పెట్రోల్​, డీజిల్​ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రజల నుంచి తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఇంతలా ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెరుగుదల ద్వారా ప్రధానంగా ఎవరు లాభపడుతున్నారు? ప్రజల అసహానికి కారణాలేంటి?

పెట్రోల్, డీజిల్​పై ప్రజల ఆగ్రహానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

  • అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర బ్యారెల్​కు 40 డాలర్లకు పడిపోయింది. అయితే ఇందుకు భిన్నంగా భారత్​లో భారీగా పెరుగుదల నమోదైంది.
  • కరోనా లాక్​డౌన్ ప్రభావంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అత్యవసరమైన పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపును అసాధారణంగా చూస్తున్నారు.

65 శాతం పన్నులే..

దేశ రాజధాని దిల్లీలో చూసినట్లయితే పెట్రోల్​, డీజిల్ వాస్తవ రిటైల్ ధరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే మూడింట రెండొంతులు ఉంది. కేంద్రం 42 శాతం పన్నులు విధించగా, రాష్ట్రం 23 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. అంటే దిల్లీ వాసులు పెట్రోల్​, డీజిల్​పై 65 శాతం పన్నుగా కడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు విధించి పన్నును అనుసరించి కొద్దిమేర వ్యత్యాసం ఉంటుంది.

19 రోజులుగా..

కరోనా నేపథ్యంలో 80 రోజుల పాటు రోజువారీ ధరల పెంపును నిలిపేశాయి ఆయిల్ కంపెనీలు. తిరిగి జూన్​ 7న రోజువారీ సవరణను ప్రారంభించాయి. అప్పటి నుంచి వరుసగా 19 రోజులు ఇంధన ధరలను పెంచాయి. ఇలా దిల్లీలో పెట్రోల్​పై రూ. 8.7, డీజిల్​పై రూ.10.63 పెరిగింది. దిల్లీలో పెట్రోల్​ ధరను డీజిల్ అధిగమించటం ఇదే తొలిసారి.

కంపెనీలదే నిర్ణయం..

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధిస్తాయే తప్ప ధరలను నిర్ణయించవని ఓ సీనియర్ అధికారి ఈటీవీ భారత్​తో వెల్లడించారు.

"పెట్రోల్​, డీజిల్​ ధరల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఆయిల్ కంపెనీలే ధరలను నిర్ణయిస్తాయి. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదు. ఇటీవల కాలంలో కంపెనీలు చవిచూసిన నష్టాలను పూడ్చుకునేందుకు రిటైల్ ధరలను పెంచుతున్నాయి. "

- సీనియర్ అధికారి

ఆయిల్ కంపెనీలు గడిచిన 10 రోజులలో ముడి చమురు సగటు ధర ఆధారంగా రిటైల్ ధరను నిర్ణయిస్తాయి, దేశీయ కంపెనీలు మొదట అధిక ధరలకు ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. అవి భారత్​కు చేరేలోపు అంతర్జాతీయంగా ధరలు పడిపోయాయి. ఈ కారణం వల్ల దేశీయ చమురు సంస్థలు నష్టపోయినట్లు ఆ అధికారి వివరించారు.

ధరలు ఇలా లెక్కిస్తారు..

ఇండియన్​ ఆయిల్​ వెబ్​సైట్ ప్రకారం.. జూన్​ 16న దిల్లీలో డీజిల్​ మూల​ ధర లీటర్​కు రూ.22.93 గా ఉంది. వీటికి కేంద్ర, రాష్ట్ర సుంకాలను కలిపి ధరలను​ ఇలా నిర్ణయిస్తారు.

డీజిల్​ మూల ధర రూ.22.93
రవాణా ఖర్చు 30 పైసలు
కేంద్రం ఎక్సైజ్ సుంకం రూ. 31.83
దిల్లీ రాష్ట్ర వ్యాట్​ రూ. 17.60
డీలర్ కమిషన్​ రూ. 2.53
మొత్తం (జూన్​ 16 నాటి ధర ) రూ.75.19

ఈ గణాంకాలను బట్టి చూస్తే డీలర్ కమిషన్​తో కలిపి మొత్తం 69 శాతం పన్నులే ఉన్నాయి. ఇందులో 42 శాతంతో కేంద్రమే భారీగా లబ్ధి పొందుతోందని అర్థమవుతోంది.

- కృష్ణానంద్ త్రిపాఠి, ఈటీవీ భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.