ETV Bharat / business

హెచ్​డీ ఛానళ్ల సంఖ్యలో టాప్​ ఎవరో తెలుసా?

డీటీహెచ్ సర్వీస్​ ప్రొవైడర్​ టాటాస్కై 91 హెచ్​డీ ఛానళ్లు అందిస్తూ ప్రథమ స్థానంలో నిలిచింది. 84 హెచ్​డీ ఛానళ్లతో ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ తరువాతి స్థానంలో ఉంది. సన్​డైరెక్ట్ 65 హెచ్​డీ ఛానెళ్లను ప్రసారం చేస్తోంది.

హెచ్​డీ ఛానళ్లలో అగ్రస్థానం 'టాటాస్కై'దే!
author img

By

Published : Aug 5, 2019, 3:32 PM IST

టాటాస్కై.. అన్ని డీటీహెచ్​ ప్లాట్​ఫామ్​ల్లో కలిపి అత్యధిక సంఖ్యలో హెచ్​డీ ఛానళ్లు కలిగి అగ్రపథాన దూసుకుపోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 100 హెచ్​డీ ఛానళ్లలో 91 ఛానళ్లను తన వినియోగదారులకు అందిస్తోంది టాటాస్కై. ద్వితీయ స్థానంలో ఎయిర్​టెల్​ డిజిటల్ టీవీ ఉంది.

ట్రాయ్​

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా(ట్రాయ్​) ప్రవేశపెట్టిన 'కొత్త నియంత్రణ నిబంధనలు'... ప్రసారాలు(బ్రాడ్​కాస్టింగ్​), డీటీహెచ్​ పరిశ్రమలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. ఇది పరిశ్రమ దృక్కోణాన్ని మార్చివేసింది. ఛానల్ ధరలు, సభ్యత్వాలు, అలాగే వినియోగదారులకు వేసే బిల్లుల విషయాల్లోనూ మార్పులు తీసుకొచ్చింది. ట్రాయ్​ చేపట్టిన ఈ సంస్కరణలు డీటీహెచ్ పరిశ్రమలో మరింత పోటీ వాతావరణం ఏర్పడటానికి దోహదం చేశాయి.

ఫలితంగా చందాదారులకు ఆకర్షణీయమైన ధరల్లో, మరిన్ని సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో వినియోగదారుడు తనకు నచ్చింది ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం చందాదారులు ఎక్కువగా నాణ్యత, ధరలు, సేవలు ప్రాతిపదికలుగా చూసుకుంటున్నారు. కొంతమంది వినియోగదారులు మాత్రం ఒక నిర్దిష్ట డీటీహెచ్ ప్రొవైడర్ అందిస్తోన్న ఛానళ్ల సంఖ్యను చూస్తున్నారు. మీరు అలాంటి వినియోగదారుడైతే ఇది మీ కోసమే.

టాటా స్కై వర్సెస్​ ఎయిర్​టెల్ డిజిటల్​ టీవీ

డీటీహెచ్​ పరిశ్రమలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 100 ఛానళ్లలో 91 హెచ్​డీ ఛానళ్లను టాటా స్కై అందిస్తోంది. వీటిలో 40 జనరల్ ఎంటర్​టైన్మెంట్​ ఛానళ్లు, 3 న్యూస్, 10 స్పోర్ట్స్, 11 ఇన్ఫోటైన్మెంట్​ ఛానళ్లు.

తరువాతి స్థానంలో ఉన్న డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్... ఎయిర్​టెల్​ డిజిటల్ టీవీ. ప్రస్తుతం ఇది 84 హెచ్​డీ ఛానళ్లను తన వినియోగదారులకు అందిస్తోంది. ప్రస్తుతం 15 హిందీ హెచ్​డీ ఛానళ్లు దీనిలో అందుబాట్లో ఉన్నాయి. టాటాస్క్లైలో లేని జీత్​ హెచ్​డీ ఛానల్​నూ ప్రసారం చేస్తోంది. దక్షిణ భారతదేశానికి చెందిన డీటీహెచ్ ప్రొవైడర్ సన్​డైరెక్ట్​ 65 హెచ్​డీ ఛానళ్లను ప్రసారం చేస్తోంది.

పోటీతత్వం మందగిస్తోంది..!

ప్రస్తుతం డీటీహెచ్​ ప్రొవైడర్స్ సరసమైన ధరలకే అధిక సంఖ్యలో హెచ్​డీ ఛానల్ ప్రసారాలను అందిస్తున్నాయి. దాదాపు అందరు చందాదారులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డీటీహెచ్​ పరిశ్రమలో పోటీతత్వం కొద్దిగా మందగించిందని చెప్పాలి.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ఏంటీ ఆర్టికల్​ 35-ఎ?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.