భారత ఆర్మీ భారీ సాయుధ రక్షణ వాహనాల కోసం టాటా మోటార్స్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ ఒప్పందంతో సైన్యంతో కాంట్రాక్ట్ దక్కించుకున్న మూడో ప్రైవేటు సంస్థగా టాటా గ్రూప్ నిలవనుంది. గతంలో భారత్ ఫోర్జ్, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్‌కు ఆర్మీ కాంట్రాక్టులు ఇచ్చింది.
చైనాతో ఉద్రిక్తతల అనంతరం మన సైనికుల కోసం మరింత సాయుధ రక్షణ వాహనాలను సేకరించాల్సిన అవసరం ఉందని ఆర్మీ గుర్తించిందని, అందుకే ఆ వాహనాల సరఫరా కాంట్రాక్టును టాటా మోటార్స్‌కు అప్పగించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత మార్చిలో మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్‌కు రూ.1,056 కోట్ల కాంట్రాక్ట్, ఫిబ్రవరిలో భారత్ ఫోర్జ్‌కు రూ.177.95 కోట్ల కాంట్రాక్ట్‌ను భారత్ ఆర్మీ అప్పగించింది.
ఇదీ చూడండి: బంగాల్లో 'పరిశ్రమల' రాజకీయం- మార్పు సాధ్యమా?