టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ మోడల్‌లో మరో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఆల్ట్రోజ్ ఐ-టర్బోగా పేర్కొంటున్న ఈ కారు ప్రమీయం హాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సరికొత్త ఫీచర్లు, కనెక్ట్ టెక్నాలజీ, మరింత శక్తిమంతమైన ఇంజిన్‌తో వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్‌ప్లస్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆల్ట్రోజ్ రెవోట్రాన్ మోడళ్ల కంటే దీని ధర రూ.60వేలు అధికంగా ఉంది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.8.26 లక్షలు కాగా.. డీజిల్‌ది రూ.9.46 లక్షలు(దిల్లీ, ఎక్స్‌షోరూం).
ఐ-టర్బో ఫీచర్లు ఇవే..
1.2-లీటర్ టర్బోఛార్జ్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 5,500 ఆర్‌పీఎం వద్ద 108 బీహెచ్‌పీ, 1,500-5,500 ఆర్‌పీఎం మధ్య 140 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. అత్యాధునిక 'ఇంటెలిజెన్స్ రియల్-టైం అసిస్ట్(iRA-connected)' సాంకేతికతను పొందుపరిచారు. మొత్తం 27 కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. దీని ద్వారా ఇంగ్లిష్, హిందీతో పాటు 'హింగ్లిష్'(హిందీ+ఇంగ్లిష్) కమాండ్లను కూడా ఇది అర్థం చేసుకుంటుంది. హ్యుందాయ్ ఐ-20 టర్బో, ఫోక్స్‌వ్యాగన్ పోలో జీటీ వంటి వాటికి పోటీగా టాటా ఈ కొత్త ఆల్ట్రోజ్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:విజయ్ మాల్యా ఎప్పటికీ బ్రిటన్‌లోనే?