ETV Bharat / business

ప్రపంచంలోనే గొప్ప హోటల్​ బ్రాండ్​గా తాజ్​!

author img

By

Published : Jun 26, 2021, 5:53 AM IST

తాజ్​ హోటల్స్​ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోని 50 గొప్ప హోటళ్లలో తాజ్​ బ్రాండ్​ అగ్రస్థానంలో నిలిచింది. 2016లో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో తొలిసారి టాప్‌ 50లోకి అడుగుపెట్టిన తాజ్‌ బ్రాండ్‌కు ఆ ఏడాది 38వ స్థానం దక్కింది.

taj strongest brand, taj hotels
ప్రపంచంలోనే గొప్ప హోటల్​ బ్రాండ్​గా తాజ్​!

ప్రపంచంలోనే అతి గొప్ప హోటల్‌ బ్రాండ్‌గా తాజ్‌ హోటల్స్‌ నిలిచినట్లు ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌-IHCL వెల్లడించింది. 2021 ఏడాది గాను గ్లోబల్‌ ఫైనాన్స్‌ వాల్యుయేషన్‌ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌ నిర్వహించిన అధ్యయనంలో..ప్రపంచం లోనే 50 గొప్ప హోటళ్లలో తాజ్‌ బ్రాండ్‌ తొలిస్థానంలో నిలిచింది. మార్కెటింగ్ పెట్టుబడి, కస్టమర్లు-సిబ్బంది సంతృప్తితో పాటు కార్పొరేట్‌ ఖ్యాతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించారు. ఈ సర్వేలో.. 296 మిలియన్‌ డాలర్లతో తాజ్‌ ప్రపంచంలోనే గొప్ప హోటల్‌ బ్రాండ్‌గా నిలిచినట్లు బ్రాండ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. అలాగే బ్రాండ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌-BSI లో 100కి 89.3 పాయింట్లను సాధించినట్లు చెప్పింది.

taj strongest brand, taj hotels
తాజ్​ ప్యాలెస్​ ముంబయి
taj strongest brand, taj hotels
తాజ్​ లేక్​ ప్యాలెస్​ ఉదయ్​పుర్​
taj strongest brand, taj hotels
తాజ్​ ఎక్సోటికా మాల్దీవ్స్​

2016లో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో తొలిసారి టాప్‌ 50లోకి అడుగుపెట్టిన తాజ్‌ బ్రాండ్‌ ఆ ఏడాది 38వ స్థానంలో నిలిచింది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ప్రిమియర్‌ ఇన్ రెండోస్థానంలో నిలవగా మెలియా హోటల్స్‌ ఇంటర్‌నేషనల్‌ , NH హోటల్‌ గ్రూప్‌, షాంగ్రీ లా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ తరువాతి స్థానాల్లో నిలిచాయి.

ఇదీ చదవండి : 'స్టాక్​మార్కెట్​లో మరో ఏడాది పాటు బుల్​దే హవా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.