దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మొదట్లో 200 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ 10,900 స్థాయిని తిరిగి పొందింది. బ్యాంకింగ్, వాహన రంగాల షేర్లు రాణించడమే ఇందుకు కారణం.
బీఎస్ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు వృద్ధి చెంది 36 వేల 874 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 10 వేల 918 వద్ద ట్రేడవుతోంది.
నిన్న కశ్మీర్ పరిణామాలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి విలువ బలహీన పడటం, కార్పొరేట్ లాభాల క్షీణత ఫలితంగా స్టాక్మార్కెట్లు భారీ పతనమయ్యాయి మార్కెట్లు.
వీటి ప్రభావం నేడూ ఉన్నప్పటికీ.... బ్యాంకింగ్, వాహన రంగాల కొనుగోళ్లు ఊపందుకోవడం... దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల బాట పట్టేందుకు కారణమైంది.
లాభాల్లో
ఇండస్ఇండ్ బ్యాంకు, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, ఎస్ బ్యాంకు, ఎల్ అండీ టీ, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు 2 శాతం లాభాలతో ట్రేడువుతున్నాయి.
నష్టాల్లో
టీసీఎస్, హెచ్యూఎల్, కోటక్ బ్యాంకు, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఆర్ఐఎల్ 1.07 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు
సోమవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లూ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి
రూపాయి విలువ 22 పైసలు తగ్గి, ఒక డాలరుకు రూ.70.50గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.99 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 60.40 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఆర్బీఐతో పాటే బ్యాంకుల వడ్డీ సవరణ..!