దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు, మదుపరులు లాభాల స్వీకరణ మొగ్గు చూపడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 485 పాయింట్లు కోల్పోయి 31 వేల 522 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 134 పాయింట్లు నష్టపోయి 9 వేల 249 వద్ద ట్రేడవుతోంది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న తొలి విడత ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించినప్పటికీ.. మదుపరులు ఇంకా వేచి చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కేంద్రం రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలో కేవలం కొద్ది మొత్తం మాత్రమే ఖర్చు పెట్టడానికి సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కుతుందా? అనే సందేహాలు మదుపరులను వెంటాడుతున్నాయి.
లాభనష్టాల్లో..
బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంకు, ఐటీసీ, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా రాణిస్తున్నాయి.
ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్ప్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎమ్ అండ్ ఎమ్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ నేలచూపులు చూస్తున్నాయి.
ఆసియా మార్కెట్లు
ప్రపంచ ఆరోగ్య సంస్థ 'కరోనా వైరస్ ఎప్పటికీ పోదు' అని చేసిన హెచ్చరికలు ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపాయి. ప్రస్తుతానికి షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వాల్‌స్ట్రీట్ కూడా నష్టాలతో ముగిసింది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం బ్యారెల్ ధర 29.19 డాలర్లుగా ఉంది.