కశ్మీర్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల మధ్య... స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను తగ్గించడం, ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, బలహీనమైన ఆర్థిక గణాంకాలు అన్నీ కలిసి దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
సెన్సెక్స్ 36 వేల మార్కు దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 561 పాయింట్లు కోల్పోయి 36 వేల 556 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 11 వేల మార్కు దిగువనే ఉంది. ప్రస్తుతం 174 పాయింట్లు నష్టపోయి 10 వేల 823 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ రాణిస్తున్నాయి.
నష్టాల్లో
ఎస్ బ్యాంకు, వేదాంత, టాటా మోటార్స్, ఎస్బీఐ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇదీ చూడండి: 'ఆర్బీఐ రెపో రేటు' మరో 25 బేసిస్ పాయింట్ల కోత?