బ్యాంకింగ్ షేర్లు డీలా..
మూడు రోజుల లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడిన నేపథ్యంలో గురువారం భారీ నష్టాలను నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 394 పాయింట్లు క్షీణించి 38,220 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 11,312 వద్దకు చేరింది.
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్ల ప్రతికూలతలు కూడా.. గురువారం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా నష్టాలతో ముగిశాయి. ఒడుదొడుకుల్లోనూ విద్యుత్ షేర్లు రాణించాయి.
- ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌టెక్ మాత్రమే సానుకూలంగా ముగిశాయి.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎం&ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.