ఆటో, ఐటీ షేర్ల దన్ను..
వారంలో మొదటి రోజును లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 173 పాయింట్లు పుంజుకుని 38,051 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 11,259 వద్దకు చేరింది.
ఆరంభంలో నష్టాలతో భయపెట్టిన మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలు గడించడం గమనార్హం. ఆటో, ఐటీ, విద్యుత్ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
- ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, మారుతీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాలను నమోదు చేశాయి.