ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు.. నిఫ్టీ@11,600+ - సెన్సెక్స్

share markets today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Sep 16, 2020, 9:34 AM IST

Updated : Sep 16, 2020, 3:53 PM IST

15:49 September 16

వాహన షేర్ల జోరు..

వృద్ధికి ఊతమందించే చర్యలుంటాయని ఆర్​బీఐ గవర్నర్ చేసిన ప్రకటనలతో స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 39,303 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 83 పాయింట్ల వృద్ధితో 11,604 వద్దకు చేరింది.

వాహన, ఐటీ, ఫార్మా షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

  • ఎం&ఎం, బజాజ్ ఆటో, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టపోయాయి.

10:14 September 16

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 70 పాయింట్ల లాభంతో 39,111 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 20 పాయింట్లు పెరిగి 11,540 వద్ద కొనసాగుతోంది.

  • ఎం&ఎం, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్​సర్వ్, మారుతీ, నెస్లే, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, హాంకాంగ్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టోక్యో, సియోల్ సూచీలు లాభాల్లో ఉన్నాయి.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 1.51 శాతం పెరిగి.. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 41.14 వద్దకు చేరిది.

08:59 September 16

స్వల్ప లాభాల్లో సూచీలు

స్టాక్ మార్కెట్లు బుధవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 60 పాయింట్ల స్వల్ప లాభంతో 39,073 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్ఈ-నిఫ్టీ స్వల్పంగా 10 పాయింట్లకుపైగా పెరిగి 11,534 వద్ద కొనసాగుతోంది.

ఆటో షేర్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

  • ఎం&ఎం, బజాజ్ ఆటో, మారుతీ, ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​సీఎల్​టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Sep 16, 2020, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.