ETV Bharat / business

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు - సెన్సెక్స్‌ 742 పాయింట్లు వృద్ధి - CORONA IMPACT ON STOCKS

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Apr 22, 2020, 10:01 AM IST

Updated : Apr 22, 2020, 3:56 PM IST

15:48 April 22

ఆరంభంలో భయపెట్టినా.. ముగింపులో జోరు

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభంలో కాస్త భయపెట్టినా చివరకు సానుకూలంగా ముగిశాయి సూచీలు. సెన్సెక్స్ 743 పాయింట్లు బలపడి 31,379 వద్దకు చేరింది. నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 9,187 వద్ద స్థిరపడింది.

రిలయన్స్ షేర్లు 10 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేశాయి. ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే, మారుతీ షేర్లు లాభపడ్డాయి.

ఓఎన్‌జీసీ, ఎల్‌&టీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:46 April 22

భారీ లాభాల్లో సూచీలు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 740 పాయింట్లు బలపడి 31,382 వద్దకు చేరింది. నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 9,181 వద్ద ట్రేడవుతోంది.

రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, హీరోమోటోకార్ప్, నెస్లే ఇండియా, ఎం&ఎం, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  

ఓఎన్‌జీసీ, ఎల్‌&టీ, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీలు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

13:42 April 22

రిలయన్స్ 10 శాతం వృద్ధి

స్టాక్ మార్కెట్లలో లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 475 పాయింట్ల వృద్ధితో 31,111 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లకుపైగా బలపడి 9,117 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.  

రిలయన్స్ షేర్లు ఏకంగా 10 శాతానికిపైగా బలపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఎం&ఎం, హీరోమోటోకార్ప్, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్‌, బజాజ్ ఫినాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

11:51 April 22

sensex
30 షేర్ల ఇండెక్స్

భారీ లాభాలు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆరభంలో ఆటుపోట్లు ఎదురైనా మిడ్‌ సెషన్ ముందు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా వృద్ధితో 31,140 వద్ద ట్రేడింగ్ సాగుతోంది. నిఫ్టీ దాదాపు 120 పాయింట్లు పెరిగి 9,100 వద్ద కొనసాగుతోంది.

హెవీ వెయిట్‌ షేర్లలో కొనసాగుతున్న కొనుగోళ్ల మద్దతు లాభాలకు కారణం. చమురు, లోహం మినహా దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.  

10:36 April 22

జీవనకాల కనిష్ఠానికి రూపాయి..

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి కాస్త తేరుకుంటున్నాయి. సెన్సెక్స్ దాదాపు 140 పాయింట్లు పుంజుకుని 30,775 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 8,997 వద్దకు చేరింది. చమురు సంక్షోభం ఉన్నా హెవీ వెయిట్‌ షేర్ల దన్ను లాభాలకు కారణంగా తెలుస్తోంది.

స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నా రూపాయి మాత్రం భారీగా క్షీణిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నేటి సెషన్‌ ప్రారంభంలోనే 76.87 వద్ద జీవనకాల కనిష్ఠానికి పతనమైంది.

ముడిచమురు ధరల సూచీ-బ్రెంట్ 13.30 శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 19.76 డాలర్ల వద్ద ఉంది.

09:33 April 22

అమ్మకాల ఒత్తిడి

స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 20 పాయింట్లకు పైగా నష్టంతో 30,612 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 8,976 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది.

చమురు ధరల పతనం సహా కరోనా భయాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. లోహ, చమురు షేర్లలో అధికంగా అమ్మకాపై దృష్టి సారిస్తున్నారు మదుపరులు.

లాభనష్టాల్లోనివి ఇవే..

జియోలో ఫేస్‌బుక్ 10 శాతం కొనుగోలుకు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు రావడం వల్ల రిలయన్స్ షేర్లు నేడు దాదాపు 6 శాతం పుంజుకున్నాయి. సన్‌ఫార్మా, మారుతీ, ఇన్ఫోసిస్, హీరోమోటోకార్ప్, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Apr 22, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.