ETV Bharat / business

కుప్పకూలిన సూచీలు- సెన్సెక్స్​ 695 మైనస్​

నవంబర్​ డెరివేటివ్​ల ముగింపు నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు కుదేలయ్యాయి. సూచీలు​ జీవితకాల గరిష్ఠాలకు చేరిన సమయంలో.. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. సెన్సెక్స్​ దాదాపు 700 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 12 వేల 858 వద్ద స్థిరపడింది.

STOCKS CLOSE
కుప్పకూలిన సూచీలు- సెన్సెక్స్​ 600-
author img

By

Published : Nov 25, 2020, 3:42 PM IST

చివరి సెషన్​లో భారీ లాభాల్లో ముగిసిన స్టాక్​మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడమే ఇందుకు కారణం. ఒక దశలో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 750 పాయింట్లకుపైగా నష్టపోయింది. చివరకు 695 పాయింట్లు కోల్పోయి.. 43 వేల 828 వద్ద సెషన్​ను ముగించింది.

ఆరంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 44 వేల 825 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అనంతరం.. ఏ కుదేలైన సూచీ ఏ దశలోనూ కోలుకోలేదు.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 197 పాయింట్లు క్షీణించి.. 12 వేల 858 వద్ద స్థిరపడింది.

3 తప్ప..

స్థిరాస్తి, టెలికాం, బ్యాంకింగ్​ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బీఎస్​ఈ 30 షేర్లలో ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​​ తప్ప.. అన్నింటికీ నష్టాలే. యాక్సిస్​ బ్యాంక్​, కోటక్​ మహీంద్రా బ్యాంక్​ అత్యధికంగా 3 శాతానికిపైగా డీలాపడ్డాయి. బజాజ్​ ఫిన్​సర్వ్​, ఏషియన్​ పెయింట్స్​ హెచ్​​డీఎఫ్​సీ, సన్​ ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​ 2 శాతం మేర కోల్పోయాయి.

ఈ ఒక్క సెషన్​లోనే దాదాపు రూ. 2 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.