ETV Bharat / business

వెంటాడిన లాక్​డౌన్​ భయం- సెన్సెక్స్ 627 డౌన్ - bse sensex

అంతర్జాతీయ బలహీన పవనాలు, మదుపరుల లాభాల స్వీకరణ, కరోనా భయాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 627పాయింట్లు కోల్పోయి.. 49,509 దిగువకు చేరింది. నిఫ్టీ 154 పాయింట్లు తగ్గి..14,690 వద్ద స్థిరపడింది.

Stock markets registered losses with the over selling by investors for profits
మదురుల లాభార్జన- నష్టాలతో ముగిసిన మార్కెట్లు
author img

By

Published : Mar 31, 2021, 3:41 PM IST

అంతర్జాతీయ ప్రతికూలతలు, కరోనా భయాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా స్టాక్​మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 627 పాయింట్లు క్షీణించింది. 49,509 వద్దకు చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయి 14,690 వద్ద స్థిరపడింది.

వేర్వేరు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు, మహారాష్ట్రలో లాక్​డౌన్​ విధించవచ్చని అక్కడి అధికార యంత్రాంగం సంకేతాలు ఇవ్వడం వంటి పరిణామాలతో పెట్టుబడిదారులు జాగ్రత పడ్డారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,050 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,442 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,813 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,670 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభాలు.. నష్టాలు

బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐటీసీ, హిందుస్థాన్​ యూనీలివర్​, ఎస్​బీఐ, టీసీఎస్​, టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్​, మారుతీ షేర్లు లాభాలను ఆర్జించాయి.

హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, టెక్​ మహీంద్ర, ఓఎన్​జీసీ, కోటక్​ మహీంద్ర బ్యాంక్​, రిలయన్స్, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్​ షేర్లు నష్టాల్లో కదలాడాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.