అంతర్జాతీయ సానుకూల పవనాలతో స్టాక్ మార్కెట్లు బుధవారం సల్వ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు మెరుగుపడి 40వేల 365కు చేరింది. 9 పాయింట్ల వృద్ధితో నిఫ్టీ 11వేల 922కు పెరిగింది.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుందో లేదో అనే సందేహాలు, హాంకాంగ్‌లో రాజకీయ అనిశ్చితి వంటి కారణాలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి.
యెస్ బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్, హెచ్‌సీఎల్ షేర్లు 2శాతానికి పైగా లాభ పడ్డాయి.
ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 1.3శాతానికిపైగా నష్టపోయాయి.
ఇదీ చూడండి: ఒకే సెట్ టాప్ బాక్స్‌తో టీవీ, వీడియో స్ట్రీమింగ్ సేవలు..