ETV Bharat / business

వరుస నష్టాలకు బ్రేక్.. సెన్సెక్స్ 748 ప్లస్

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Aug 4, 2020, 9:44 AM IST

Updated : Aug 4, 2020, 3:49 PM IST

15:41 August 04

రిలయన్స్ షేర్ల జోరు..

అంతర్జాతీయ సానుకూలతలు, హెవీ వెయిట్ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 748 పాయింట్లు పుంజుకొని 37,688 వద్దకు చేరింది. నిఫ్టీ 211 పాయింట్ల వృద్ధితో 11,103 వద్ద స్థిరపడింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 7 శాతానికిపైగా లాభపడింది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, మారుతీ, యాక్సిస్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలు నమోదుచేశాయి. 

టెక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.

12:17 August 04

సెన్సెక్స్ 600 +

మిడ్​ సెషన్​ తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 600 పాయంట్లకుపైగా లాభంతో 37,540 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 170 పాయింట్లకుపైగా బలపడి 11,064 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు 4 శాతానికిపైగా బలపడటం భారీ లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక, వాహన రంగాలు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఐటీ షేర్లు డీలా పడ్డాయి.

  • రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, మారుతీ, బజాజ్​ ఆటో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
  • టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:16 August 04

భారీ లాభాలు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 360 పాయింట్లకుపైగా బలపడి 37,300 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు పుంజుకుని 10,990 వద్ద ట్రేడవుతోంది.

హెవీ వెయిట్ షేర్లయిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్​లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. వీటితో పాటు హెచ్​డీఎఫ్​సీ, ఓఎన్​జీసీ, ఏషియన్ పెయింట్స్ మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:25 August 04

లాభాలొచ్చాయ్..

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు మంగళవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు, బ్యాంకింగ్, ఆటో షేర్ల దన్నుతో దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 60 పాయింట్ల లాభంతో 36,996 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 30 పాయింట్లు బలపడి 10,919 వద్ద ట్రేడవుతోంది.

ఓఎన్​జీసీ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, మారుతీ, రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​టెక్, పవర్​గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Aug 4, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.