ETV Bharat / business

భారీలాభాల్లో ముగిసిన స్టాక్​మార్కెట్లు

stock market opens  green
భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 1200+
author img

By

Published : Apr 7, 2020, 9:18 AM IST

Updated : Apr 7, 2020, 3:49 PM IST

15:41 April 07

మార్కెట్లకు భారీ లాభాలు..

స్టాక్​మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్​, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు దేశీయ సూచీలకు ఊతమిచ్చాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​.. 30 వేల ఎగువకు చేరింది.​ ఏకంగా 2 వేల 476 పాయింట్లు పెరిగి... 30 వేల 67 వద్ద స్థిరపడింది. 

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ కూడా భారీగా లాభపడింది. 702 పాయింట్ల లాభంతో 8 వేల 786 వద్ద సెషన్​ను ముగించింది. 

మొత్తం 1813 షేర్లు లాభపడ్డాయి. 535 షేర్లు క్షీణించాయి. మరో 189 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.  

లాభనష్టాల్లో..

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, హిందాల్కో, ఎం అండ్​ ఎం, గ్రేసిమ్​ ఇవాళ్టి ట్రేడింగ్​లో లాభాలను నమోదుచేశాయి. ఫార్మా రంగం పుంజుకుంది. 

రూపాయి...

దాదాపు 55 పైసలు పుంజుకున్నరూపాయి... డాలర్​తో పోలిస్తే 75.63 వద్ద స్థిరపడింది. 

14:27 April 07

స్టాక్​మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 2100 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం.. 29 వేల 774 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సుమారు 618 పాయింట్ల లాభంతో... 8 వేల 700 మార్కు దాటింది. ఫార్మా, బ్యాంకింగ్​ రంగాల షేర్లు దూసుకెళ్తున్నాయి. 

ఇండస్​ఇండ్​ బ్యాంకు, ఐసీఐసీఐ, యాక్సిక్​ బ్యాంకులు సహా మారుతీ సుజుకీ, నెస్లీ రాణిస్తున్నాయి. 

బజాజ్​ ఫిన్​సర్వ్​, బజాజ్​ ఫినాన్స్​లు నష్టాల్లో ఉన్నాయి. 

10:12 April 07

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు ఇవాళ లాభాల బాట పట్టాయి.  బ్యాంకింగ్​, ఐటీ, ఆటో రంగాల్లో కొనుగోళ్లు జరగడమూ లాభాలకు మరో కారణం.  

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభంలో 1300 పాయింట్లకుపైగా పెరిగింది. ప్రస్తుతం 1245 పాయింట్ల లాభంతో 28,836 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 8 వేల 400 మార్కు దాటింది. 353 పాయింట్లు పెరిగి 8,437 వద్ద కొనసాగుతోంది.  

శుక్రవారం నాటి ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 674, నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో ముగిశాయి.  

లాభనష్టాల్లో...

ఇండస్​ఇండ్​ బ్యాంకు సెన్సెక్స్​ ప్యాక్​లో ఉత్తమ లాభాలు నమోదుచేసింది. దాదాపు 15 శాతం పెరిగింది. మహీంద్రా అండ్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​లు రాణించాయి.  

బజాజ్​ ఫినాన్స్​ భారీగా నష్టపోయింది. ఐటీసీ, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐచర్​ మోటార్స్​ కూడా నష్టపోయిన జాబితాలో ఉన్నాయి.  

ఇతర మార్కెట్లు...

ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంగ్​కాంగ్​, టోక్యో, సియోల్​లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు కూడా సోమవారం లాభాల్లోనే ముగిశాయి.  

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 2 శాతం మేర పెరిగి.. బ్యారెల్​కు 33.93 డాలర్ల వద్ద ఉంది.  

రూపాయి..  

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి 21 పైసలు పెరిగింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 75.92 వద్ద ఉంది.  

09:16 April 07

భారీలాభాల్లో ముగిసిన స్టాక్​మార్కెట్లు

స్టాక్​ మర్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా లాభంతో 28 వేల 815 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 185 పాయింట్ల వృద్ధితో 8 వేల 440 వద్ద కొనసాగుతోంది.

వరుస నష్టాల తర్వాత తగ్గిన ధరల వద్ద కొనుగోళ్లు జరిపేందుకు మదుపర్లు మొగ్గుచూపడం, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందన్న వార్తలు... నేటి లాభాలకు ప్రధాన కారణం.

Last Updated : Apr 7, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.