ETV Bharat / business

మూడో రోజూ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

stocks news
స్టాక్ మార్కెట్ వార్తలు
author img

By

Published : Mar 26, 2020, 9:23 AM IST

Updated : Mar 26, 2020, 3:50 PM IST

15:45 March 26

మూడోరోజూ లాభాలే..

స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగింది. సెన్సెక్స్ 1,411 పాయింట్లు వృద్ధి చెంది చివరకు 29,947 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 324 పాయింట్ల లాభంతో 8,641 వద్దకు చేరింది.

కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి వరుస నష్టాల్లో ఉన్న ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ నేడు రికార్డు స్థాయిలో 46 శాతం లాభాన్ని గడించింది. ఎల్‌&టీ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫినాన్స్ షేర్లు భారీగా లాభపడ్డాయి.

మారుతీ, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

14:35 March 26

కాస్త వెనక్కి..

స్టాక్ మార్కెట్లు సెషన్ ముగింపునకు ముందు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,040 పాయింట్లకు పైగా లాభంతో 29,580 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 230 పాయింట్ల వృద్ధితో 8,540 వద్ద కొనసాగుతోంది.

మిడ్‌సెషన్‌కు ముందుతో పోలిస్తే సూచీలు కాస్త వెనక్కి తగ్గినా.. ఇండస్ఇండ్‌ బ్యాంక్ మాత్రం భారీ లాభాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ స్క్రిప్‌ 35 శాతం లాభంతో ట్రేడవుతోంది. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌&టీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫినాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

మారుతీ, రిలయన్స్, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

12:59 March 26

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 1440 పాయింట్లు బలపడి ప్రస్తుతం 29,990 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 393 పాయింట్ల లాభంతో 8700కు పైగా ట్రేడవుతోంది.

11:31 March 26

నెమ్మదించిన లాభాలు..

మిడ్‌సెషన్‌ ముందు స్టాక్ మార్కెట్ల లాభాలు కాస్త నెమ్మదించాయి. సెన్సెక్స్ 920 పాయింట్లకు పైగా లాభంతో 29,460 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ దాదాపు 270 పాయింట్ల వృద్ధితో 8,584 వద్ద ట్రేడవుతోంది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ ఏకంగా 37 శాతానికిపైగా వృద్ధితో దూసుకుపోతోంది.

ఎన్‌టీపీసీ, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్, రిలయన్స్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

10:45 March 26

30 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 1,465 పాయింట్లకు పైగా వృద్ధితో తిరిగి 30 వేల మార్క్‌ను దాటింది. నిఫ్టీ 370 పాయింట్లు పెరిగి 8,691 వద్ద ట్రేడవుతోంది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్ రికార్డు స్థాయిలో 35 శాతానికిపైగా వృద్ధి చెందింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ 10 శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి.

ఐటీసీ, మారుతీ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

10:07 March 26

బ్యాంకింగ్ రంగం జోరు..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 1,060 పాయింట్లకుపైగా వృద్ధితో తిరిగి 29,597 వద్దకు చేరింది. నిఫ్టీ దాదాపు 280 పాయింట్లు బలపడి 8,596 వద్ద ట్రేడవుతోంది.  

ఆర్థిక ప్యాకేజీ ఆశలు బ్యాంకింగ్ రంగాన్ని పరుగు పెట్టిస్తుండటం నేటి లాభాలకు కారణంగా తెలుస్తోంది.

30 షేర్ల ఇండెక్స్ ఇలా..

వరుసగా భారీ పతనాలు నమోదు చేస్తూ వచ్చిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ నేడు ఏకంగా 20 శాతం లాభంతో కొనసాగుతోంది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.  

ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:39 March 26

bse30
బీఎస్‌ఈ 30 షేర్ల ఇండెక్స్

లాభాల పరంపర..

స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ లాభాల పరంపర కొనసాగుతోంది. కరోనా భయాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు భారత్‌, అమెరికా ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ సానుకూలతలతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.  

సెన్సెక్స్ 730 పాయింట్లకు పైగా బలపడి 29,272 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 180 పాయింట్ల లాభంతో 8,494 పాయింట్లు వద్ద ట్రేడవుతోంది.

09:15 March 26

ఉద్దీపనలపై ఆశలు- స్వల్ప లాభాల్లో మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు వరుసగా 3వ సెషన్​లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 350 పాయింట్లు వృద్ధి చెంది 28 వేల 880 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 8 వేల 385 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Mar 26, 2020, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.