ETV Bharat / business

సూచీలను భయపెట్టిన వాణిజ్య యుద్ధం

వారాంతాన్ని  నష్టాలతో ముగించాయి సూచీలు. శుక్రవారం నాటి  ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 424 పాయింట్లు  పతనమయి 36,546 వద్ద, నిఫ్టీ  125 పాయింట్లు క్షీణించి 10,943 వద్ద  ట్రేడయ్యాయి.

author img

By

Published : Feb 8, 2019, 7:28 PM IST

స్టాక్​

వారాంతాన్ని నష్టాలతో ముగించాయి సూచీలు. శుక్రవారం నాటి ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 424 పాయింట్లు పతనమయి 36,546 వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించి 10,943 వద్ద ట్రేడయ్యాయి.

మెటల్​, ఆటోమెబైల్​ రంగాల్లో ఆకస్మాత్తుగా సంభవించిన అమ్మకాలు సూచీల పతనానికి కారణమయయ్యాయి.

నేటి ట్రేడింగ్​లో భారీ నష్టాలు మూటగట్టకున్న సంస్థలలో టాటామోటార్స్​ మొదటి వరుసలో నిలిచింది. వేదాంత,టాటా స్టీల్స్​, ఓఎన్​జీసీ, ఎల్​&టీ, కోల్ ఇండియా, మారుతీ,యాక్సిస్ ​బ్యాంక్​ తరువాతి స్థానాల్లో నిలిచాయి.

కోటక్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​, బజాజ్​ లాభాల్లో గడించాయి. ఎఫ్​సీజీ, ఫార్మా రంగ షేర్లకూ నేల చూపులు తప్పలేదు.

గురువారం నాటికి విదేశీ పెట్టుబడి దారులు 418 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని బీఎస్​ఈ తెలిపింది.

కారణాలేంటి?

⦁ చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో భేటీకి ట్రంప్​ విముఖత చూపడంతో వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశముందన్న సంకేతాలు మార్కెట్లో చక్కర్లు కొట్టాయి. ఆందోళనకు గురైన మదుపరులు అమ్మకాలు జరిపారు.

⦁ జపాన్​,కొరియా సహా ఇతర అసియా మార్కెట్ల నష్టాలూ సూచీలను భయపెట్టాయి.

⦁ గత కొద్ది రోజులుగా తగ్గు ముఖంలో ఉన్న చమురు ధరలు స్వల్పంగా పెరగడమూ నష్టాలకు కారణం

రూపాయి బలపడింది

రూపాయి పుంజుకుంది. డాలర్​తో పోలిస్తే నేడు 32 పైసలు బలపడి, మారకపు విలువ 71.13 వద్ద స్థిరపడింది.

New Delhi, Feb 08 (ANI): Delegation of Delhi Bharatiya Janata Party (BJP) reached at the Election Commission (EC) office and met with the Chief Election Commissioner in Delhi today. MoS for Parliamentary Affairs Vijay Goel, BJP leaders Ramesh Bhiduri and Parvesh Rana went to EC office to address their issues. BJP complained to EC of false charges made by Delhi Chief Minister Arvind Kejriwal.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.