ETV Bharat / business

స్టాక్​మార్కెట్ల లాభాల జోరుకు కళ్లెం - నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల దేశీయ స్టాక్​మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తామన్న చైనా ప్రకటనతో వాల్​స్ట్రీట్ రాణించింది.

BSE Sensex opens red
స్టాక్​మార్కెట్ల లాభాల జోరుకు కళ్లెం
author img

By

Published : Feb 7, 2020, 10:11 AM IST

Updated : Feb 29, 2020, 12:14 PM IST

దేశీయ స్టాక్​మార్కెట్ల ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తామన్న చైనా ప్రకటనతో వాల్​స్ట్రీట్ కళకళలాడింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 91 పాయింట్లు కోల్పోయి 41 వేల 214 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 12 వేల 112 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

ఎన్​టీపీసీ, హీరోమోటోకార్ప్, జీ ఎంటర్​టైన్​మెంట్​, యూపీఎల్​, టైటాన్​ కంపెనీ, హెచ్​సీఎల్​ టెక్, ఐటీసీ రాణిస్తున్నాయి.

టాటా మోటార్స్, టాటాస్టీల్, పవర్​గ్రిడ్ కార్ప్, లార్సెన్ అండ్ టుబ్రో, ఎస్​బీఐ నష్టాల్లో ఉన్నాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు నిక్కీ, కోస్పీ, షాంగై కాంపోజిట్, హాంగ్​సెంగ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

కీలకరేట్లు యథాతథం

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోరేటును 5.15 శాతం యథాతథంగా ఉంచింది. అయితే వృద్ధి పునరుద్ధరణకు ఊతమిస్తామని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ ప్రకటనతో నిన్న స్టాక్​మార్కెట్లు రాణించాయి.

రూపాయి

రూపాయి విలువ 9 పైసలు తగ్గి, ప్రస్తుతం ఒక డాలరుకు రూ.71.27గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.33 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 55.30 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: పీఎస్​బీల విలీనం ఓ ఛాలెంజ్‌: ఎస్‌బీఐ ఛైర్మన్‌

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/kerala-fm-tables-economic-review-outlines-88-pc-growth-in-secondary-sector20200207083302/

Conclusion:
Last Updated : Feb 29, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.